MY NAME

THIS SITE CREATED BY VENKATESHH AMIRISHETTY

new

subpals

Free YouTube Subscribers

Monday 31 October 2016

పాత స్మార్ట్ ఫోన్ ఉందా... పారేయకండి.. ఎన్నో ఉపయోగాలున్నాయ్ మరి!

మారుతున్న కాలానికి అనుగుణంగా,రోజుకో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి దిగుతున్న వేళ... ఏదో ఒక రోజు పాత ఫోన్ ను పక్కన పడేసి కొత్తది కొనేందుకు ఉత్సాహం చూపుతుంటాం. ఈ నేపథ్యంలో పాత స్మార్ట్ ఫోన్ ను పూర్తిగా మూలన పడేయకుండా చక్కగా వినియోగించుకునే మార్గాలు అనేకం ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

నిఘా కెమెరాలుగా: ఇంట్లోనో, కార్యాలయంలోనో నిఘా కెమెరాలుగా పాత స్మార్ట్ ఫోన్లు చక్కగా పనిచేస్తాయి. వీటిలోని డేటాను తీసివేసి, మెమొరీ కార్డును వేసి ఐపీ వెబ్ కామ్ లేదా టినీ కామ్ మానిటర్ వంటి యాప్ వేసుకుని ఎక్కడైనా సీసీటీవీగా ఉపయోగించుకోవచ్చు. ఈ వీడియోలను క్లౌడ్ స్టోరేజ్ సర్వర్లలో అప్ లోడ్ చేసుకుని కంప్యూటర్ లో ఎక్కడి నుంచైనా చూసుకునే సౌలభ్యం ఉంది.

కారులో జీపీఎస్ గా: మీరు కొత్త నగరానికి వెళ్లినప్పుడు లేదా ఉన్న చోటే ట్రాఫిక్ అప్ డేట్ ను ఎప్పటికప్పుడు తెలియజేసేలా మీ పాత స్మార్ట్ ఫోన్ ను జీపీఎస్ గా వాడుకుని కారులో బిగించుకోవచ్చు. ఇప్పుడిప్పుడే ప్రతి కారులో జీపీఎస్ తప్పనిసరి అవసరంగా మారుతున్న వేళ, దీనికోసం అదనంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు.

డిజిటల్ ఫోటో ఫ్రేమ్ గా: మీ వద్ద ఉన్న ఆపాత మధుర చిత్రాలను పాత స్మార్ట్ ఫోన్ లో ఫీడ్ చేసుకుని, దాన్ని ఆఫీస్ టేబుల్ పైఓ డిజిటల్ ఫోటో ఫ్రేమ్ గా అలంకరించుకోవచ్చు. ఫోటోలు ఒకదాని తరువాత ఒకటి డిస్ ప్లే అవుతుండగా, మీ పాత స్మార్ట్ ఫోన్ ఆఫీసు వాతావరణాన్ని మరింతఆహ్లాదకరం చేస్తుంది.

మీడియా సర్వర్: ఇష్టమైన సంగీతం నుంచి వీడియోల వరకూ పాత స్మార్ట్ ఫోన్ ను మీడియా సర్వర్ గా వాడుకోవచ్చు. దానిలోని వివిధ రకాల మీడియాను, కొత్త ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకోకుండానే చూసుకునే సౌలభ్యం ప్లెక్స్, బబుల్ యూపీఎన్పీ వంటి యాప్స్ సాయంతో దగ్గరవుతుంది.

యూనివర్సల్ రిమోట్ కంట్రోల్: మీ పాత స్మార్ట్ ఫోన్ లో ఐఆర్ బ్లాస్టర్ తో వచ్చివుంటే, దాన్ని అన్ని రకాల గృహోపకరణాలకూ యూనివర్సల్ రిమోట్ గా వినియోగించుకోవచ్చు. టీవీల నుంచి ఏసీల వరకూ అన్నింటినీ నియంత్రించవచ్చు.

ఈ-బుక్ రీడర్ గా: మీకు నచ్చిన, మీరు మెచ్చిన పుస్తకాల సమాచారాన్ని ఫోన్ మెమొరీలో దాచుకుని, వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు చదువుకునే ఈ- బుక్ రీడర్ గా మీ పాత స్మార్ట్ ఫోన్ ను వినియోగించుకోవచ్చు.

వైర్ లెస్ హాట్ స్పాట్: మీ ఇంట్లో ఇంటర్నెట్ వైఫై కనెక్షన్ లేకుంటే, పాత స్మార్ట్ ఫోన్ ఎంతో ఉపయోగపడుతుందన్న మాటే. ఓ సపరేట్ 4జీ సిమ్ తీసుకుని, దానికి తక్కువగా లభించే 3జీ, 4జీ డేటా ప్యాక్ లనుమాత్రమే వేసుకుంటూ, స్మార్ట్ ఫోన్ ను హాట్ స్పాట్ గా మార్చి మిగతా ఫోన్లకు వై-ఫై వాడుకోవచ్చు.

చిన్నారులకు తొలి స్మార్ట్ ఫోన్ గా: మీరు ఓ కొత్త స్మార్ట్ ఫోన్ కొన్న వేళ, పాత ఫోన్ ను స్మార్ట్ ఫోన్ పరిచయం లేని వారికి అందిస్తే వారికెంతో మేలు కలుగుతుంది. ఇక ఇంట్లోని చిన్నారులకు తొలి స్మార్ట్ ఫోన్ గానూ దీన్ని అందించవచ్చు.

Saturday 29 October 2016

Saturday 1 October 2016

మీ జియో 4జీ ఫోన్లులో కోడ్ Generate అవ్వడం లేదా ? అయితే ఇలా చేయండి !

Jio sim తీసుకోవటానికి కోడ్ generate చేయాలి అనేది కన్ఫర్మ్. కోడ్ లేకుండా సిమ్ తీసుకోవటం కుదరటం లేదు. అయితే కోడ్ ఏలా generate చేయాలి అని లేటెస్ట్ గా తెలపటం జరిగింది. కాని చాలా మందికి కోడ్ generate అవటం లేదు. సో ఎందుకు అవటం లేదు, ఏమి చేయాలి? తెలుసుకుందాము రండి!
ఎందుకు కోడ్ generate అవటం లేదు?
MyJio యాప్ ను ఇంస్టాల్ చేయటం ద్వారా గతంలో చాలా మంది అఫీషియల్ గా కంపెని సపోర్ట్ చేయని 4G ఫోనులపై కూడా కోడ్ generate చేసుకొని సిమ్ తీసుకోవటం జరిగింది.

సో కంపెని వెంటనే యాప్ ను అప్ డేట్ చేసి bug solve చేసి ఫోన్ ట్రాకింగ్ ను కష్టం చేసింది. అందుకే ప్లే స్టోర్ లో ప్రస్తుతం available గా ఉన్న My Jio App మీ ఫోన్ ను సరిగ్గా ఐడెంటిఫై చేయలేకపోతుంది.
మరి దీనికి సొల్యూషన్ ఏంటి?
ప్లే స్టోర్ లో ఉన్న updated MyJio యాప్ వెర్షన్ కాకుండా గతంలో అందరికీ ఈజీగా కోడ్ generate చేసిన old వెర్షన్ My Jio apk ను డౌన్లోడ్ చేసుకొని వాడాలి. ఈ లింక్ (MyJio 3.2.05 version) నుండి డౌన్లోడ్ చేయగలరు ఓల్డ్ వెర్షన్ apk ను.
ఇప్పుడు ఫోన్ మెయిన్ సెట్టింగ్స్ లో ఉన్న security ఆప్షన్ లోకి వెళ్తే Unknown sources ఆప్షన్ కనిపిస్తుంది. దానిని enable చేసి apk ఫైల్ ను ఫోన్ లో ఎక్కడ డౌన్లోడ్ చేశారో అక్కడకు వెళ్లి (సాధారణంగా downloads ఫోల్డర్ లో ఉంటుంది) apk మీద క్లిక్ చేస్తే యాప్ ను ఇంస్టాల్ చేయగలరు. లేదంటే మీరు విడిగా apk ఫైల్ ను ఇంస్టాల్ చేయగలరు.
అయితే old వెర్షన్ యాప్ ఇంస్టాల్ చేసినంత మాత్రం కోడ్ generate అవ్వదు. క్రింద చెప్పిన స్టెప్స్ ను జాగ్రత్తగా ఫాలో అయితే కోడ్ generate అవుతుంది. క్రింద తెలిపిన ప్రాసెస్ 3G ఫోనులో కూడా పనిచేస్తుంది.
  • ముందుగా మీరు ప్లే స్టోర్ నుండి ఇంస్టాల్ చేసుకున్నలేటెస్ట్ My Jio App మరియు ఇతర అన్ని Jio యాప్స్ ను uninstall చేయాలి.
  • ఫోన్ లో WiFi లేదా మొబైల్ ఇంటర్నెట్ అనేవి ఆన్ అయ్యి ఉండకూడదు. ఆఫ్ చేసి పెట్టండి.
  • ఇప్పుడు ముందుగా డౌన్లోడ్ చేసిన apk ఫైల్ (లింక్) ను ఇంస్టాల్ చేయాలి.
  • యాప్ ఇంస్టాల్ చేసిన తరువాత ఓపెన్ చేయకుండా ఫోన్ రిస్టార్ట్ చేయాలి.
  • ఫోన్ ఆన్ అయిన తరువాత ఇంటర్నెట్ ఆఫ్ లో ఉండగానే My Jio యాప్ ఓపెన్ చేయండి.
  • మీకు ఎప్పుడూ కనిపించే Welcome to your digital life అనే స్క్రీన్ కనిపిస్తుంది. కాని కొత్తగా ఇప్పుడు దాని క్రింద Get Jio Sim అనే మెసేజ్ ఉంటుంది.
  • ఇప్పుడు ఫోన్ యొక్క హోమ్ బటన్ ప్రెస్ చేసి ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి ఫోన్ లో మొబైల్ ఇంటర్నెట్(WiFi కాదు) ను ఆన్ చేయండి.
  • వెంటనే మరలా బ్యాక్ గ్రౌండ్ లో రీసెంట్ యాప్స్ లిస్టు లో రన్ అవుతున్న Jio యాప్ ను ఓపెన్ చేసి Get Jio Sim పై క్లిక్ చేయండి.
  • Next  స్క్రీన్ లో మీకు Agree and Continue అనే మెసేజ్ వస్తుంది. దాని పై క్లిక్ చేయాలి.
  • ఇక ఇక్కడ నుండి మీరు యాప్ లో వచ్చే instructions ఫాలో అయితే మీకు కోడ్ వస్తుంది. Jio యాప్స్ అన్నీ కూడా ఇంస్టాల్ చేయాలి. కోడ్ ను స్క్రీన్ షాట్ (పవర్ బటన్ మరియు వాల్యూం ప్లస్ బటన్ ఒకే సారి ప్రెస్ చేసి) తీసి పెట్టుకోవటం మంచిది.
  • అంతే! ఇదే కోడ్ ను పట్టుకొని, ఆధర్ కార్డ్ ఒరిజినల్ మరియు xerox ను తీసుకోని స్టోర్ కు వెళ్లి సిమ్ అడిగితే సిమ్ ఇస్తారు.
పైన చెప్పినది పనిచేయకపోతే క్రింద అదే ప్రోసెస్ ను వేరే స్టెప్స్ తో చేయండి…
  • ఆల్రెడీ ఇంస్టాల్ అయ్యి ఉన్న Jio యాప్ ను uninstall చేయండి ముందు.
  • ప్లే స్టోర్ నుండి మళ్ళీ అదే యాప్ ను ఇంస్టాల్ చేసుకోండి.
  • ఓపెన్ చేసి Install All బటన్ పై క్లిక్ చేయగలరు ఇప్పుడు. అన్ని Jio యాప్స్ ఇంస్టాల్ చేసేసి యాప్ ను close చేయండి (రీసెంట్ యాప్స్ లిస్టు నుండి కూడా).
  • ఇప్పుడు ఫోన్ లోని WiFi అండ్ మొబైల్ ఇంటర్నట్ రెండూ ఆఫ్ చేసేయాలి.
  • మరలా My Jio యాప్ ను ఓపెన్ చేయండి. మీకు ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ లేదు అని చెబుతుంది స్క్రీన్ పై.
  • కాని ఆ మెసేజ్ ను పట్టించుకోకండి. వెంటనే మీకు Get Jio సిమ్ అనే బటన్ కూడా కనిపిస్తుంది.
  • ఇప్పుడు దానిపై క్లిక్ చేయండి. మరలా ఇంటర్నెట్ లేదు అని మెసేజ్ వస్తుంది.
  • ఇప్పుడు మీరు ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి WiFi లేదా మొబైల్ ఇంటర్నెట్ ను ఆన్ చేసి మరలా రీసెంట్ యాప్స్ లిస్టు లో ఉన్న My Jio యాప్ ను ఓపెన్ చేసి Get Jio sim బటన్ పై ప్రెస్ చేస్తే మీకు కోడ్ generate అయ్యే ముందు ఉండే agree and get Jio Offer స్క్రీన్ కనిపిస్తుంది. next స్క్రీన్ లో కోడ్ generate చేసుకోవటమే. అంతే!
అయితే ఈ ప్రోసెస్ రెడ్మి నోట్ 3, Mi మాక్స్, oneplus వంటి ఫోనులపై సక్సెస్ ఫుల్ గా పనిచేస్తుంది అని రిపోర్ట్స్. కాని ఆపిల్ ఫోనులపై సక్సెస్ రేట్ తక్కువుగా ఉంది.

ముఖ్యమైన గమనిక:  చాలా సమయాన్ని రీసర్చ్ పై కేటాయించి మీకు ఈ సమాచారాన్ని తెలియజేస్తున్నాను. ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాలలో ఉన్న వారందరికీ Jio పై ఇంత ఎక్కువ సమాచారాన్ని ఇంత క్లియర్ గా అర్థమయ్యేలా తెలియజేస్తుంది నేనే అనుకుంటున్నాను! ఇంకా ఎవరైనా ఉంటే ఆనందమే! నాలెడ్జ్ షేర్ అవటం కావాలి కాని నేనే షేర్ చేయాలనే కోరికలు లేవు నాకు. కాని సింపుల్ గా కాపీ పేస్టు చేసి కంటెంట్ ను సింపుల్ గా కాపీ చేయకుండా, లింక్ తో పాటు క్రెడిట్స్ ఇవ్వండి! ఇక్కడ మీరు గమనించ వలసిన మరొక విషయం ఏమిటంటే “Jio కోడ్ జెనరేటింగ్, సిమ్ కార్డ్ యాక్టివేషన్ అండ్ సిమ్ కార్డ్ తీసుకోవటం” అనే విషయాలలో రిలయన్స్ సైతం ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ వస్తుంది. సో గతంలో నేను చాలా కష్టపడి వ్రాసినవి తరువాత మార్పులు చోటుచేసుకున్నాయి. మీరు మొదటి నుండీ గమనిస్తే నా ఆర్టికల్స్ లో కన్ఫ్యూషన్ లేకుండా చాలా క్లియర్ గా ఉండే ప్రయత్నం చేస్తాను. మేజర్ గా ఎక్కువ మందికి ఉన్న డౌట్స్ ను ముందుగా పరిగణించి వాటికీ ముందు సల్యుషణ్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తుంటాను. ఎంత తెలియజేసినా ఇంకా కొత్త కొత్త అడ్డంకులు వస్తున్నాయి Jio విషయంలో. కారణం Jio టోటల్ ప్రోసెస్ లో ప్రస్తుతానికి చాలా బగ్స్ ఉన్నాయి. అవి కంపెని సాల్వ్ చేస్తేనే కాని ఒక కచ్చితమైన సోలుషన్స్ అనేవి ఉండవు. అందుకే పైన చెప్పిన సోలుషన్స్ మరియు ఇప్పటి వరకూ అందించినవి ఒకరికి పనిచేయవచ్చు మరొక ఫోనులో పనిచేయకపోవచ్చు.  కాని వీలైనంతవరకూ ఆర్టికల్స్ ద్వారా తెలుగు ప్రజలకు మాత్రం కన్ఫ్యూషన్ ఉండకూడదు అనేది నా ప్రియారిటీ. ఎందుకంటే నేను మీలో ఒకడిగా ఉన్న వాడినే ఒకప్పుడు. ఏదైనా స్పష్టంగా తెలియకపోవటం అనేది ఎంత నిస్సహాయంగా ఉంటుందో తెలుసు! కాని రీడర్స్ అందరికీ ఒక విజ్ఞప్తి! దయచేసి “ఈ ఫోనులో Jio పనిచేస్తుందా” అనే meaningless ప్రశ్నలు వేయకండి ఇంకా! మీ ఫోనులో 4G ను ఏలా చెక్ చేసుకోవాలో  మోస్ట్ వాంటెడ్ డౌట్స్ స్టోరీ లో తెలిపాను. దయచేసి అది చదవండి. ఫైనల్ గా మరొక మేజర్ స్టోరీ మీకు తెలియజేయలనుకుంటున్నాను. అదే.. “ఆల్రెడీ Jio తీసుకొని ఇంకా సిమ్ యాక్టివేషన్ కోసం ఎదురుచూపులు చూస్తున్న వారి” కోసం అందుబాటులో ఉన్న సల్యుషణ్స్ కు సబందించిన స్టోరీ. అయితే దీనికి కచ్చితమైన సల్యుషణ్ వచ్చే వరకూ తెలియజేయటానికి అవ్వదు.