MY NAME

THIS SITE CREATED BY VENKATESHH AMIRISHETTY

new

subpals

Free YouTube Subscribers

Friday 30 September 2016

ఒక్క రూపాయితో ఐడియా అన్ లిమిటెడ్ ఇంటర్నెట్!

రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌, వొడా ఫోన్‌, ఐడియా ప్రస్తుతం ఈ మూడింనాలుగింటి మధ్యనే ఉచితవార్‌ నడుస్తోంది. రిలయన్స్‌జియో4జి తన మూడునెలల ఉచితసిమ్‌ ఆఫర్‌తో ఇతర కంపెనీలకు వణుకుపుట్టించిన సంగతి తెలిసిందే. 4జి డేటా వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద డిసెంబరు 31వ తేదీవరకూ అందిస్తామని ప్రకటించింది. ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా కూడా కొత్త కొత్త ప్లాన్లతో తమ మార్కెట్‌ వాటాను సుస్థిరం చేసుకునేదిశగా కసరత్తులు ప్రారంభించాయి. జియో4జితో పోటీని తట్టుకునే యత్నాలు శతవిధాల చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ నాలుగు టెలికాం ఆపరేటర్లు అందిస్తున్న ఉచిత ఆఫర్‌లను ఓసారి పరిశీలిస్తే పోటి ఎంతగా ఉందో తెలుస్తుంది.

తాజాగా ఐడియా మరో ఆసక్తికరమైన ఆఫర్ ని అందుబాటులోకి తెచ్చింది. అదేటంటే, ఒక్క రూపాయికే అన్ లిమిటెడ్ 4G డేటా. ఈ ఆఫర్ ని వాడుకోవాలంటే మీ దగ్గర 4జీ LTE ని సపోర్ట్ చేసే ఫోన్ తోపాటు, ఐడియా 4జీ సిమ్ ఉండాలి. ఇవి రెండూ ఉంటే కనీసం ఒక్క రూపాయి బ్యాలెన్స్ ఉండాలి. అన్నీ ఉంటే మీ ఐడియా 4జీ సిమ్ నుంచి 411 కి కాల్ చేసి చెప్పిన సూచనల్ని పాటించండి. వెంటనే మీ బ్యాలెన్స్ నుంచి ఒక్క రూపాయి కట్ చేసుకోని 4జీ ని అన్ లిమిటెడ్ సేవల్ని అందిస్తుంది ఐడియా.

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ ఆఫర్ యొక్క వాలిడిటి ఒక్క గంట మాత్రమే. ఆ ఒక్క గంటలో మీరెంతైనా వాడుకోవచ్చు, ఎన్ని ఫైల్స్ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ఒక్క గంటసేపు అన్ లిమిటెడ్ 4జీ ఇంటర్నెట్ మీ సొంతం. అలాగైతే గంటకోసారి రిఛార్జ్ చేసుకోవచ్చు అని అత్యాశపడకండి. ఒక్క నంబర్ పై ఒకేసారి పనిచేస్తుంది ఈ ఆఫర్. ఈ ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి త్వరపడండి.

చైనా బ్రాండ్‌లకు షాక్, రూ.4,500కే సామ్‌సంగ్ 4జీ ఫోన్!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ సామ్‌సంగ్..దేశీయ మార్కెట్లోకి చౌక ధర కలిగిన 4జీ మోడల్‌ను విడుదల చేసింది. జెడ్2 పేరుతో ప్రవేశపెట్టిన ఈ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.4,500గా నిర్ణయించింది. తొలిసారిగా స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారిని లక్ష్యంగా చేసుకొని రూపొందించిన ఈ మొబైల్‌ను టైజెన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో తయారుచేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఇప్పటికీ 55 కోట్ల మంది భారతీయులు ఫీచర్ ఫోన్లను వాడుతుండగా, ప్రతినెల కోటికిపైగా ఫీచర్ ఫోన్లు అమ్ముడవుతున్నప్పటికీ జెడ్2తో స్మార్ట్‌ఫోన్ల పరిధి మరింత పెరిగే అవకాశం ఉందని సామ్‌సంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్(మొబైల్ బిజినెస్) మను శర్మ తెలిపారు.

ఇప్పటి వరకు కంపెనీ నుంచి విడుదలైన 4జీ స్మార్ట్‌ఫోన్లలో ఇదే చౌకధరదని ఆయన వెల్లడించారు. మంగళవారం విడుదల చేసినప్పటికీ ఈ నెల 29 నుంచి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ సేవల సంస్థ పేటీఎంలో కూడా లభ్యమవనున్నదన్నారు. నాలుగు అంగుళాల టచ్‌స్క్రీన్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్లో 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ మెమొరీ(128 జీబీ వరకు పెంచుకోవచ్చును), 5 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, ముందుభాగంలో 0.3 మెగాపిక్సెల్ కెమెరా, 1,500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

ముకేశ్ అంబానీకి చెందిన టెలికం సేవల సంస్థ రిలయన్స్ జియోతో సామ్‌సంగ్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలుచేసిన వారికి మూడు నెలలపాటు ఉచితంగా కాల్, మొబైల్ డేటా లభించనున్నది.

మీరు చేస్తున్న ప్రతీ పని గూగుల్ రికార్డ్ చేస్తుంది ! గూగుల్ నుండి తప్పించుకోవాలంటే ఇలా చేయండి

మీ ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ను అడ్డం పెట్టుకుని మీ స‌మాచారంతో మిమ్మ‌ల్ని ఎవ‌రైనా మోసం చేస్తారు. ఇది చాలా సుల‌భంగా జ‌రుగుతుంది. ఇప్పుడు మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల‌లో జ‌రుగుతుంది కూడా ఇదే. ఇంత‌కీ మీ స‌మాచారాన్ని సేక‌రిస్తుంది ఎవ‌రో తెలుసా..? గూగుల్‌… అవును, మీరు ఆశ్చ‌ర్య‌పోయినా, ఇది పచ్చి నిజం..!

మ‌నం ఇప్పుడు వాడుతున్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల‌లో ఆ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ సాఫ్ట్‌వేర్‌ను అందిస్తోంది ఎవ‌రో మీకు తెలుసు క‌దా., ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ గూగుల్… ఆ కంపెనీ త‌యారు చేసిందే ఆండ్రాయిడ్ ఓఎస్ (ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌). ఈ క్రమంలో మ‌నం వాడుతున్న ఆండ్రాయిడ్ ఫోన్‌లో మీరు గూగుల్‌కు చెందిన యాప్స్ చాలానే చూసి ఉంటారు. గూగుల్ మ్యాప్స్‌, క్రోమ్ బ్రౌజ‌ర్‌, డ్రైవ్‌, హ్యాంగ‌వుట్స్, మ్యాప్స్‌… ఇలా చెప్పుకుంటూ పోతే మ‌నం మ‌న ఫోన్ల‌లో గూగుల్ కు చెందిన యాప్స్‌ను చాలానే వాడుతున్నాం. అయితే ఈ సంద‌ర్భంలో మీకు తెలియ‌ని విష‌యం ఒక‌టుంది. అదే మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల‌లో ఉండే స‌మాచారాన్నంతా గూగుల్ ఎప్ప‌టిక‌ప్పుడు సేక‌రిస్తుంద‌ని… అవును, ముందు చెప్పిన గూగుల్‌ యాప్స్‌ను వాడ‌డం వ‌ల్ల మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఏం చేస్తుందీ, ఏం చూస్తుందీ ఎప్ప‌టిక‌ప్పుడు గూగుల్ హిస్ట‌రీలో సేవ్ అవుతూ ఉంటుంది. వాయిస్ క‌మాండ్ల ద్వారా ఫోన్లో సెర్చ్ చేస్తే అది గూగుల్ హిస్ట‌రీలో రికార్డ్ అవుతుంది. అయితే దీని గురించి దాదాపుగా చాలా త‌క్కువ మంది యూజ‌ర్ల‌కే తెలుసు. ఎవ‌రికీ తెలియ‌దు. ఈ క్ర‌మంలో అలా సేవ్‌, రికార్డ్ అయ్యే మీ స‌మాచార‌మంతా మీరు ఆండ్రాయిడ్ డివైస్‌లో వాడుతున్న జీమెయిల్ అకౌంట్‌లో ఉండిపోతుంది. అయితే దీన్ని ఎవరూ చూసేందుకు అవ‌కాశం లేదు. కానీ ఒక వేళ మీడివైస్ ఎవ‌రికైనా దొరికితే వారు ఆ సమాచారాన్ని సుల‌భంగా సేక‌రించేందుకు వీలుంటుంది. కాబ‌ట్టి మీ గూగుల్ అకౌంట్ హిస్ట‌రీలో సేవ్ అయ్యే ఇన్ఫ‌ర్మేష‌న్‌ను అంతా ఎప్ప‌టిక‌ప్పుడు డిలీట్ చేస్తుండాలి. అది ఎలా చేయాలో కింద చూడండి…





  • కంప్యూట‌ర్‌లో ఏదైనా బ్రౌజ‌ర్ ఓపెన్ చేసి అందులో అడ్ర‌స్ బార్‌లో history.google.com అని టైప్ చేసి ఎంట‌ర్ ప్రెస్ చేయాలి. అనంత‌రం మీరు ఆండ్రాయిడ్ డివైస్‌లో వాడుతున్న జీమెయిల్ అకౌంట్‌తో అందులోకి లాగిన్ అవ్వాలి.
  • గూగుల్ హిస్ట‌రీ అకౌంట్‌లోకి లాగిన్ అవ‌గానే మీకు గూగుల్ మై యాక్టివిటీ పేరిట ఓ విండో ప్ర‌త్య‌క్ష‌మై క‌నిపిస్తుంది. అందులో మీరు ఏయే డివైస్‌లో ఏం సెర్చ్ చేసిందీ చూపిస్తుంది.
  • ఎడ‌మ చేతి వైపు పై భాగంలో ఉన్న బండిల్ వ్యూను ఎంచుకుంటే మీరు నిర్దిష్ట స‌మ‌యం, తేదీల్లో ఏం సెర్చ్ చేసిందీ బండిల్ రూపంలో మొత్తం ఒకే డేటాలా చూసుకోవ‌చ్చు. దాన్ని డిలీట్ చేయాల‌నుకుంటే కుడి చేతి వైపు ఉండే 3 నిలువు డాట్స్‌పై క్లిక్ చేసి డిలీట్ బ‌ట‌న్‌ను ప్రెస్ చేస్తే స‌రిపోతుంది. స‌ద‌రు హిస్టరీ, డేటా మొత్తం క్లీన్ అవుతుంది.
  • అదే మీరు కొన్ని నిర్దిష్ట ఐట‌మ్స్ మాత్ర‌మే డిలీట్ చేయాల‌నుకుంటే బండిల్ వ్యూ కిందే ఐట‌మ్ వ్యూ అని ఉంటుంది. అందులో ఐటంల వారీగా అవ‌స‌రం లేని ఐటంల‌ను డిలీట్ చేసుకోవ‌చ్చు. అయితే అందుకోసం కూడా పైన చెప్పిన‌ట్టుగా కుడి చేతి వైపు ఉండే 3 నిలువు డాట్స్‌ను క్లిక్ చేసి అనంత‌రం వ‌చ్చే డిలీట్ బ‌ట‌న్‌ను ప్రెస్ చేయాలి. దీంతో డేటా అంతా క్లియ‌ర్ అవుతుంది.
  • మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాయిస్ కమాండ్ల ద్వారా సెర్చ్ చేసిన డేటాను డిలీట్ చేయాలంటే గూగుల్ మై యాక్టివిటీ విండోలో ఎడమ చేతి వైపు కింద ఉండే యాక్టివిటీ కంట్రోల్స్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. అనంత‌రం వ‌చ్చే విండోలో కింద‌కి వెళ్లి వాయిస్ అండ్ ఆడియో యాక్టివిటీని ఎంచుకోవాలి. దాని కింద ఉండే మేనేజ్ యాక్టివిటీని క్లిక్ చేయాలి.
  • మేనేజ్ యాక్టివిటీలోకి వెళ్ల‌గానే ఇంత‌కు ముందు గూగుల్ మై యాక్టివిటీ విండోలో వ‌చ్చిన‌ట్టుగానే బండిల్ వ్యూ, ఐటం వ్యూ అని రెండు ఆప్ష‌న్స్ క‌నిపిస్తాయి. వాటిలో దేన్ని సెలెక్ట్ చేసుకుని అయినా పైన చెప్పిన‌ట్టుగా మీరు వాయిస్ క‌మాండ్ల ద్వారా గూగుల్‌లో సెర్చ్ చేసిన డేటాను క్లియ‌ర్ చేసుకోవ‌చ్చు.

ప్రపంచంలో ఎక్కువుగా జరుగుతున్న ఆన్‌లైన్‌‍లో మోసాలు ఇవేనంట – అందరు చదవండి

ఇంటర్నెట్ ఓ గొప్ప కమ్యూనికేషన్ సాధనం. ఈ అతిపెద్ద సమాచార వ్యవస్థలో మంచికి ఎంత చోటు ఉందో, చెడుకు అంతే చోటు ఉంది. ఇంటర్నెట్ ను ఆధారంగా చేసుకుని నేరాలకు పాల్పడే వారి సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది.

ఇంటర్నెట్ ద్వారా నేరాలకు పాల్పడే సైబర్ నేరస్తులకు సెంటిమెంట్లు ఉండవు. జీవితాలతో ఆడుకోవటమే వాళ్లకు తెలుసు. సైబర్ నేరగాళ్లు ఇంటర్నెట్ వ్యసవ్థను చీడపట్టిస్తూ ప్రపంచ భద్రతనే ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ఇంటర్నెట్ ఆధారంగా జరిగే ఆర్థిక, వ్యక్తిగత ఇంకా భద్రతాపరమైన నేరాలను సైబర్ క్రైమ్స్ అని అంటారు. నెటిజనులు వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఫేస్బుక్ అకౌంట్లో
మన ఫేస్బుక్ అకౌంట్లో రకరకాల లింక్స్ పోస్ట్ అవుతుంటాయి. ఇటీవల కాలంలో స్కామర్లు తమ కొత్త ఎత్తుగడలో భాగంగా సోషల్ మీడియా లింక్స్లో వైరస్ను జొప్పించి ఫేస్బుక్ అకౌంట్లలో పోస్ట్ చేస్తున్నారు. వీటిని క్లిక్ చేసినట్లయితే వైరస్ మీ అకౌంట్ను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంటుంది.

కాలర్ ఐడీ స్కామ్లతో జాగ్రత్త

కాలర్ ఐడీ కుంభకోణాల్లో భాగంగా గుర్తు తెలియని నెంబర్ల నుంచి మీకు ఫోన్ కాల్స్ వస్తాయి. వాళ్లు మిమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేసి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లను అడిగే ప్రయత్నం చేస్తారు. కాబట్టి గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే కాల్స్తో జాగ్రత్తగా ఉండండి.
ఆఖరి నిమిషంలో టికెట్ డీల్స్ అంటూ
ఆఖరి నిమిషంలో టికెట్ డీల్స్ అంటూ అనేక ప్రకటనలు మనకు ఇంటర్నెట్లో కనిపిస్తుంటాయి. పొరపాటున ఆ లింక్ పై క్లిక్ చేస్తూ మీ వ్యక్తిగత వివరాలను నింపమని అడుగుతుంది. మీరు బుక్ చేసుకోబోయే సంబంధిత టికెట్లకు సంబంధించి అధికారిక వెబ్సైట్లను మాత్రమే ఆశ్రయించండి.
గర్ల్ఫ్రెండ్ స్కామ్
సైబర్ నేరగాళ్లు తమ కొత్త ఎత్తులో భాగంగా అమ్మాయిల ఫోటోలను ఎరగా చూపి నెటిజనులను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఈమెయిల్ ఫిష్షింగ్ లింక్ స్కామ్
ఈ తరహా స్కామ్లలో భాగంగా మీకో మెయిల్ వస్తుంది. మీ బ్యాంక్ ఖాతా హ్యాక్ అయిందని, కాబట్టి ఈ లింక్ పై క్లిక్ చేసి ఐడీ ఇంకా పాస్వర్డ్ మార్చుకోవాలని ఆ మెయిల్లో ఉంటుంది. పొరపాటున ఈ విధమైన లింక్స్ పై క్లిక్ చేసినట్లయితే మీ బ్యాంక్ అకౌంట్కు సంబంధించిన వివరాలన్నీ హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతాయి.

Tuesday 27 September 2016

మీకు తెలుసా ఉప్పును కొంచెం తీసుకుని మీ ఇంట్లో అక్క‌డ‌క్క‌డా చ‌ల్లితే ఏం జ‌రుగుతుందో

ఇప్పుడంటే మ‌నం దేన్న‌యినా శుభ్రం చేయాలంటే వ‌స్తువుకు తగిన‌ట్టుగా ర‌క ర‌కాల స్ప్రేలు, పౌడ‌ర్ల‌ను వాడుతున్నాం. కానీ మీకు తెలుసా..? ఒక‌ప్పుడు మ‌న పూర్వీకులు కేవలం ఉప్పుతోనే ఆయా వ‌స్తువుల‌ను ఎంతో శుభ్రం చేసుకునే వారు. అవును, ఉప్పే. ఎందుకంటే అందులో ఉండే ప‌లు గుణాల వ‌ల్ల ఉప్పును అనేక విధాలుగా శుభ్రం చేసే కార‌కంగా మ‌న వాళ్లు ఉప‌యోగిస్తూ వ‌చ్చారు. ఈ క్రమంలో ఉప్పుతో మ‌న‌కు ఎలాంటి ఉప‌యోగాలు ఉన్నాయో, దాంతో వేటిని శుభ్రం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

1. కొద్దిగా ఉప్పును మీ ఇంట్లోని త‌లుపులు, కిటికీలు, షెల్ప్‌ల వంటి ప్ర‌దేశాల్లో చ‌ల్లండి. దీంతో చీమ‌లు రావు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఇంట్లో ఉండే తేమ వాతావర‌ణం కూడా పొడిగా అవుతుంది.
2. కొద్దిగా ఉప్పు, కొంత యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను తీసుకుని మిశ్ర‌మంగా చేయాలి. దీంతో రాగి, వెండి, ఇత్త‌డి పాత్ర‌ల‌ను తోమితే అవి త‌ళ‌త‌ళా మెరుస్తాయి.
3. రెండు, మూడు టేబుల్ స్పూన్ల ఉప్పును 3.5 లీట‌ర్ల గోరు వెచ్చని నీటిలో వేసి బాగా క‌ల‌పాలి. దీన్ని ఉప‌యోగించి కిటికీ తలుపులు, గ్లాస్ విండోస్‌, కార్ విండోస్‌ల‌ను క్లీన్ చేస్తే శుభ్రంగా మెరుస్తాయి.
4. పైన చెప్పిన ఉప్పు, గోరు వెచ్చని నీటి మిశ్ర‌మాన్ని ఉప‌యోగించి కిచెన్ సింక్‌ను క్లీన్ చేస్తే అందులో జామ్ అయిన ప‌దార్థాల‌న్నీ పోతాయి.
5. కొద్దిగా ఉప్పు, ల‌వంగ నూనె లేదా ఆలివ్ ఆయిల్‌ను తీసుకుని బాగా క‌లిపి శ‌రీరానికి రాయాలి. అనంత‌రం కొంత సేపు ఆగాక స్నానం చేయాలి. దీంతో చ‌ర్మంపై ఉండే మురికి మొత్తం పోయి శ‌రీరం కాంతివంతంగా మారుతుంది.


6. కొంత నీటిలో ఉప్పును వేసి బాగా క‌లిపి, ఆ నీటిలో ఒక గుడ్డ ముక్క‌ను ముంచి దాంతో కార్పెట్లు, దుప్ప‌ట్లు, దుస్తులపై ప‌డ్డ మ‌ర‌కల‌ను తుడ‌వాలి. దీంతో ఆ మర‌క‌లు ఇట్టే తొల‌గిపోతాయి.

7. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొంత ఉప్పు వేసి బాగా క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని 1 నిమిషం పాటు నోటిలో వేసుకుని పుక్కిలించాలి. దీంతో దంతాల నొప్పి, నోటి పూత వంటివి పోతాయి.
8. బేకింగ్ సోడా, ఉప్పును స‌మాన భాగాల్లో తీసుకుని మిశ్ర‌మంగా చేయాలి. దీన్ని కొంత నీటికి కలిపి పేస్ట్‌లా చేసి దాంతో ప‌ళ్లు తోముకుంటే ప‌ళ్లు మిల‌మిలా మెరుస్తాయి.
9. దుస్తుల‌ను డిట‌ర్జెంట్ లేదా స‌బ్బుతో ఉతికిన త‌రువాత నీటిలో కొద్దిగా ఉప్పును వేసి ఆ నీటిలో దుస్తుల‌ను ముంచి తీయాలి. దీంతో దుస్తులు ష్రింక్ అవ‌వు. దీనికి తోడు బ‌ట్ట‌లు శుభ్రంగా, మృదువుగా మారుతాయి.

సెకండ్లలలో చార్జింగ్ ఎక్కె కనెక్టర్ కనిపెట్టిన రాజమౌళి మేనల్లుడు

సమాజంలో డబ్బులు ఎలాగైనా సంపాదించవచ్చు… కాని పద్దతిగా సంపాదించటమే కష్టమవుతుంది. ఇప్పుడు ఇదే సమస్య మొబైల్ ఫోన్‌లో వచ్చింది. వేలు పోసి మొబైల్ ఫోన్ కొనడం ఈజీయే…కాని దాంట్లో చార్జింగ్ మేయింటన్ చేయటమే కష్టంగా మారింది. ప్రతి స్మార్ట్ ఫోన్ లో వచ్చే ప్రధాన స్మార్ట్ ప్రాబ్లమ్ చార్జింగ్…దీనిని రెక్టిపై చేసాడు రాజమౌళి మేనల్లుడు. మనషుల బాధ తీర్చడానికి మామ సినిమాలు చేస్తే… అల్లుడు ఏకంగా స్పీడుగా చార్జింగ్ ఎక్కే కనెక్టర్ కనిపెట్టాడు.

 మనిషి జీవితాన్ని మొబైల్ ఫోన్స్ ఎంత సింపుల్ మార్చాయో…వాడే ప్రతి ఒక్కరికి తెలుసు. ఎంతలా అంటే  దూరంగా ఉండేవారికి ఫోన్‌తో కనెక్ట్ అవుతాం…ఆఫీసు వర్క్‌ని ఫోన్ నుంచి చేస్తాం…మనకు కావాల్సిన విషయాన్ని బ్రౌస్ చేస్తాం. మరి ఇంతలా మనకు ఉపయోగపడుతున్న మొబైల్ ఫోన్ లో వచ్చే ప్రధానమైన సమస్య చార్జింగ్ …ఇప్పడి వరకు మొబైల్స్ ఎన్ని పనులు సింపుల్ గా చేసినా…చార్జింగ్  విషయంలో వెనకబడి ఉన్నాయనే చెప్పాలి దాని తగ్గించడానికి మార్కెట్ లోకి కొత్త పరికరం వచ్చింది.

మనం ఎదో పనిలో ఉంటాం…సడెంన్‌గా ఫోన్ మాట్లాడాలి. అంతలో చార్జింగ్ ఉండదు… ఎంత చిరాకు వస్తుంది…అప్పుడే చార్జింగ్ పెట్టడానికి చార్జర్ వెతుకుతాం..లాఫ్ టాప్‌‌తో చార్జింగ్ పెడుదామంటే కనెక్టర్ పనిచేయదు …ఇలాంటప్పుడే ప్రధానంగా మూడు సమస్యలు వస్తాయి.
1.చార్జింగ్ స్లోగా అవుతుంది.
2. కనెక్టర్ తెగిపోయింటుంది.
3. చార్జర్ కనెక్టర్ ఫోన్ పోర్ట్ లో పట్టదు.
పనిచేస్తుంటే… ఇలాంటి సమస్యలు మనని వెంటాడుతుంటాయి. ఇలాంటి ఇబ్బందులు తప్పించుకోవడానికి మార్కెట్ లోకి కొత్త కనెక్టర్ వచ్చింది. అదే MUCONNECT
దీని వల్ల కలిగేలాభాలు
-ఆటోమేటిక్ గా మీ డివైస్ ని డిటెక్ట్ చేస్తుంది
-చార్జింగ్ చాల స్పీడుగా జరుగుతుంది
-మీరు క్షణాల్లో చార్జింగ్ పెట్టుకోవచ్చు.
మీరు వర్క్ చేసుకుంటున్నా, ట్రావెలింగ్ లో ఉన్నా , పడుకున్నా..ఎక్కడైనా ఈజీగా చార్జింగ్ పెట్టుకోవచ్చు. దీనితో ఈజీగా చార్జింగ్ పెట్టుకోవచ్చు.


ఇది ఏలా పనిచేస్తుందంటే…..
దీంట్లో విడివిడిగా రెండు పిన్నులుంటాయి. ఒకటి మీ చార్జర్ కోసం..రెండోది ఫోన్ కు కనెక్ట్ చేయటం కోసం.
1. మీ ఫోన్ లో ఉన్న సాకేట్ కు ఒక పిన్ను జోడించాలి
2.రెండో పిన్నును మీ చార్జర్ పిన్నుకు జాయింన్ చేయాలి
3. కనెక్టర్ ను మీ ఫోన్ దగ్గరికి తీసుకురండి.
5.ఆటోమెటిక్ గా మ్యాగ్‌నేటిక్ పవర్‌తో కనెక్ట్ అవుతుంది.
4.ఈ కనెక్టర్ కి రెండు బటన్స్ ఉంటాయి…ఒకటి చార్జింగ్ కోసం… రెండోది డేటా కోసం లెప్ట్ అండ్ రైట్ కదిపితే మీకు కావాల్సిన ఆప్షన్ లభిస్తుంది.
ఈ కనెక్టర్ మీ ఫోన్ ఐఫోన్ అయినా…ఆండ్రాయిన్ ఫోన్ అయినా…దేనిలోనైనా పనిచేస్తుంది.

Monday 26 September 2016

మొబైల్ లో బ్యాంకు లావాదేవీలు ఎక్కువ‌గా చేస్తారా? అయితే ఈ జాగ్ర‌త్తలు పాటించండి.

ఇంటర్నెట్ బ్యాంకింగ్ వచ్చాక మోసాలు చాల ఎక్కువగా జరుగుతున్నాయ్ చాలామంది మన పాస్వర్డ్ ని దొంగలించి మనకి తెలియకుండా మన ఎకౌంటు లో ఉన్న డబ్బు ని కాజేస్తూ ఉంటారు . ఇంక ఈ మొబైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వచ్చాక ఐతే వీళ్ళ పని ఇంకా సులభం అయ్యింది . మీరు మొబైల్, ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ ఎక్కువ‌గా వాడుతుంటే ఈ జాగ్రతలు తీసుకోండి .
1. మీ బ్యాంక్ వివ‌రాల‌ను తెలియ‌జేయ‌మ‌ని వ‌చ్చే కాల్స్‌, ఈ-మెయిల్స్‌, ఎస్ఎంఎస్‌ల‌కు స్పందించ‌వ‌ద్దు. ఎందుకంటే బ్యాంకు వారు ఎప్పుడూ అలా అడ‌గ‌రు.
2. ఆన్‌లైన్‌, మొబైల్ బ్యాంకింగ్‌ల‌కు వాడే ఈ-మెయిల్స్‌, ఫోన్ నంబ‌ర్ల‌ను ఎవ‌రికీ చెప్ప‌క‌పోవ‌డ‌మే ఉత్త‌మం.
3. ఆన్‌లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వ‌హించాలంటే స‌ద‌రు బ్యాంక్ వెబ్‌సైట్‌ను ఇంట‌ర్నెట్ బ్రౌజ‌ర్‌లో టైప్ చేసి మాత్ర‌మే ఓపెన్ చేయాలి. వేరే ద‌గ్గ‌ర్నుంచి ఓపెన్ చేస్తే మీ బ్యాంక్ స‌మాచారం ఇత‌రుల చేతుల్లోకి వెళ్లేందుకు అవ‌కాశం ఉంటుంది.
4. మొబైల్‌, ఆన్‌లైన్ బ్యాంకింగ్ పాస్‌వ‌ర్డ్‌ల‌ను క‌నీసం 3 నెల‌ల‌కు ఒక‌సారి అయినా మారుస్తుండాలి.
5. ఎవ‌రైనా మీ ఫోన్ నెట్‌వ‌ర్క్ బాగాలేదు, ఫోన్‌ను ఒక‌సారి స్విచ్ ఆఫ్ చేయండి అని చెబితే వెంట‌నే జాగ్ర‌త్త ప‌డండి. ఎందుకంటే నెట్‌వ‌ర్క్ ఆప‌రేట‌ర్లు అలా ఫోన్ చేసి చెప్ప‌రు. ఒక వేళ అలాంటి ఫోన్ కాల్స్ క‌న‌క వ‌స్తే అప్పుడు మీ మొబైల్‌, ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ అకౌంట్ల‌ను లాక్ చేయండి. లేదంటే పాస్‌వ‌ర్డ్‌లు, ఈ-మెయిల్స్‌, మొబైల్ నంబ‌ర్స్‌ను మార్చండి.
6. మీ బ్యాంక్ లావాదేవీల‌పై ఎల్ల‌ప్పుడూ ఓ క‌న్నేసి ఉంచండి. ఎప్ప‌టిక‌ప్పుడు స్టేట్‌మెంట్స్ చూసుకోండి.
7. బ్యాంక్ లేదా మొబైల్ సేవ‌ల‌కు సంబంధించి ఎలాంటి అంత‌రాయాన్న‌యినా మీరు గ‌మ‌నించిన‌ట్ట‌యితే వెంట‌నే స‌ద‌రు కంపెనీని సంప్ర‌దించి వివ‌రాలు తెలుసుకోండి.

ఏటీఎం (ATM) నుండి నకిలీ నోట్లు వస్తే ఇలా చేయండి..

మాములుగా ఎవరైనా పొరపాటున దొంగనోట్లు ఇస్తే ఏం చేస్తాం, వాటిని తిరిగి వారికే ఇచ్చేసి మంచి నోట్లని తీసుకుంటాం, బ్యాంకు లో ఇస్తే అప్పటికప్పుడు నోట్లని మార్చేసుకుంటాం, కాని ఏటీఎం మెషిన్ నుండే దొంగనోట్లు వస్తే ఏం చెయ్యాలో చాలా మందికి తెలియదు, అలాంటి వారి కోసమే ఈ ఆర్టికల్.


ఏటీఎం లలో దొంగనోట్లు వస్తే చాలా మంది వెంటనే బ్యాంకుకి వెళ్లి అడుగుతుంటారు, కాని బ్యాంకు వాళ్ళు తమకు ఏం సంబంధం తెలియ‌ద‌ని స‌మాధానం చెప్ప‌డం, దీంతో బాధితులు గ‌గ్గోలు పెట్ట‌డం ఇప్పుడు స‌ర్వ సాధార‌ణం అయింది, అయితే ఏటీఎంల‌లో న‌కిలీ నోట్లు వస్తే వాటిని బ్యాంకు ద్వారానే అసలైన నోట్లని పొందవచ్చు.

ఏటీఎంలో దొంగ నోట్లు వస్తే ఇలా చెయ్యండి:

  • ఏటీఎంలో నకిలీ నోట్లు వస్తే వెంటనే అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డుకు చెప్పాలి.
  • సెక్యూరిటీ గార్డు దగ్గర ఉండే రిజిస్ట‌ర్‌లో మీరు విత్ డ్రా చేసిన మొత్తం, ఓట్ల ఎన్ని నకిలీ నకిలీ నోట్లు వచ్చాయి, వాటి నంబర్లు, సమయం, తేది,ఏటీఎం స్లిప్ నెంబర్ వివరాలని రాసి సంతకం చేయాలి.
  • ఆ తరువాత బ్యాంకుకి వెళ్లి మేనేజర్ కి ఒక లెటర్ ద్వారా కంప్లైట్ చెయ్యాలి, లెటర్ తో పాటు ఏటీఎం స్లిప్ జీరాక్స్, బ్యాంకు పాస్ బుక్ జీరాక్స్ లని జత చేసి, ఏటీఎం వద్ద రిజిస్టర్ లో రాసిన వివరాలని అందించాలి.
  • బ్యాంకు వారు మీ దగ్గర ఉండే నకిలీ నోట్లని తీసుకోని వాటిని స్కాన్ చేసి నకిలీ నోట్ల కాదా..! అని పరీక్షిస్తారు.
  • అవి నకిలీ నోట్లే అయితే మీరు ఇచ్చిన వివరాలని సరి చూసుకొని సరైన నోట్లని తిరిగి ఇస్తారు.
*ఇలా కంప్లైంట్ చేసే సమయంలో ఏటియం స్లిప్ ని, నకిలీ నోట్లని, కంప్లైంట్ లెటర్ ని ఫోటోలు తీసి పెట్టుకోవడం ఇంకా మంచిది.

రిజర్వ్ బ్యాంకు నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్రతి బ్యాంకు పైన చెప్పిన విధంగా ఖచ్చితంగా చెయ్యాలి, అలా చెయ్యకుండా తమకు ఏం సంబంధం లేదని బ్యాంకు వారు అంటే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయవచ్చు, రిజర్వ్ బ్యాంకు ఇ-మెయిల్ కి కూడా త‌మ ఫిర్యాదుతో కూడిన లేఖ‌ను మెయిల్ రూపంలో పంపించ‌వ‌చ్చు, లేక పోతే స్థానికంగా ఉండే బ్యాంకింగ్ అంబుడ్స్‌మ‌న్ అధికారులకు కూడా ఫిర్యాదు చేసి వెంటనే వారి నుండి త‌క్ష‌ణ‌ సహాయాన్ని పొంది బ్యాంకు నుండి నకిలీ నోట్లకి బదులు అసలైన నోట్లని పొందవచ్చు.

మిత్రులందరికీ షేర్ చెయ్యండి

బ‌స్టాండ్‌, రైల్వేస్టేష‌న్లోమీ మొబైల్ ను చార్జ్ చేసుకునే అలవాటు ఉందా? ఇక ఆ అల‌వాటుకు గుడ్ బై చెప్పాల్సిందే.

సాధ్యమైనంతవరకు రైలు లో ఛార్జింగ్ పెట్టకండి ఎందుకంటే అన్ని రోజులు ఒకేలవుండవు ఏమైనా జరగవచ్చు చెప్పలేం… short circuit అయ్యే ప్రమాదం వుంటుంది.చాల మంది ఫోన్ ట్రైన్ లో ఛార్జింగ్ పెట్టి రాత్రి మొత్తం అలావదిలేస్తారు… ఎట్టి పరిస్థితి లో అలా చెయ్యకండి చాల ప్రమాదం.. మీకు అంతగా అవసరం వుంటే పవర్ బ్యాంకు ఒకటి కున్నుకోండి MI power bank, Samsung power bank, ఇలా చాల రకాలు మార్కెట్ లో దొరుకుతాయీ..

ఇంకో ముఖ్యమైన విషయంమీరు దూర ప్రాంతాల‌కు ట్రావెల్ చేయాల్సి వ‌చ్చిన‌ప్పుడు మీకు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు తదితర పబ్లిక్ ప్రదేశాల్లో ఉండే చార్జర్లతో మీ మొబైల్ ను చార్జ్ చేసుకునే అలవాటు ఉందా? ఉంటే, ఇక ఆ అల‌వాటుకు గుడ్ బై చెప్పాల్సిందే. లేకుంటే మీ ఫోన్‌లో ఉన్న గుట్టు మొత్తం ఇత‌రుల‌కు తెలిసిపోవ‌చ్చు. చార్జింగ్ పెట్టిన ఫోన్ల లో నుంచి సమాచారాన్ని తస్కరించే మొబైల్ చార్జర్లు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. ఇవి మీ సమాచారాన్ని తస్కరిస్తున్నాయన్న విషయం కూడా మీకుతెలియదంటే నమ్మండి.. వీటిని ఎంత జాగ్రత్తగా తయారు చేశారో..!

ఈ చార్జ‌ర్ల‌లో మామూలు చార్జ‌ర్ కాకుండా ఓ ప్ర‌త్యేక‌మైన సర్క్యూట్ ను అమర్చుతారు. ఒకసారి ఫోన్‌ను ఈ చార్జ‌ర్‌తో చార్జింగ్ పెట్టాక త‌ర్వాత సర్క్యూట్ యాక్టివేట్ అయ్యి ఫోన్ ను యూఎస్బీ ఓటీజీ మోడ్ లోకి తీసుకెళ్లిపోతుంది. ఈ తరహా మోడ్యాక్టివేట్ అవగానే సమాచారాన్ని తస్కరించాలనుకునే వ్యక్తి ఇంటర్ నెట్ ద్వారా లేదా రేడియో ఫ్రీక్వెన్సీసిగ్నల్స్ ద్వారా ఫోన్ లోని డేటాను కాపీ చేసుకుంటారు. అంతే మీ ఫోనోలో ఉన్న మీ ప‌ర్స‌న‌ల్ గుట్టు మొత్తం వాళ్ల‌కు చేరిపోతుంది.

మ‌రో షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నా కూడా ఈ డేటా చోరీకి గుర‌య్యేలా హ్యాక‌ర్లు ఈ వ్య‌వ‌స్థ‌ను చాలా ప‌క‌డ్బందీగా త‌యారు చేశారు. ఇలా ప‌నిచేసే డివైజ్ పేరు ‘మీమ్’ దీనిని మొబైల్స్ నుంచి డేటాను ట్రాన్స్ ఫర్ చేయడానికి, చార్జింగ్, బిల్ట్ ఇన్ స్టోరేజ్ తదితరాలను రూపొందించారు.

గ్రూప్‌-2 గెలుపు ప్రణాళిక!

టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్‌-2 ప్రకటన ద్వారా భర్తీ చేయబోయే 1032 ఉద్యోగాలపై ఆశతో లక్షల మంది శ్రద్ధగా సన్నద్ధమవుతున్నారు. ఈ పరీక్షను నవంబర్‌ 11, 13 తేదీల్లో నిర్వహిస్తామని ప్రకటించారు. ఇక మిగిలింది 45 రోజులు మాత్రమే. ఈ సమయమే అభ్యర్థుల విజయానికి కీలకమవుతుంది!

గ్రూప్‌-2 పరీక్షార్థులు రెండు రకాలుగా ఉంటారు. సిలబస్‌ జారీ చేసిననాటినుంచి- అంటే గత ఏడాదిగా సన్నద్ధమవుతున్నవారు; ఇటీవల అనుబంధ నోటిఫికేషన్‌ వచ్చాక నెల రోజులుగా తయారయ్యేవారు. ఈ రెండు రకాల అభ్యర్థులూ ఈ 45 రోజుల ప్రణాళికను తగినవిధంగా రూపొందించుకోవాలి.ఇప్పటికే సిలబస్‌ను సమగ్రంగా చదివినవారు 4 పేపర్లలోని సబ్జెక్టుల్లో ముఖ్యాంశాలను పునశ్చరణ చేసుకోవాలి. సబ్జెక్టు, టాపిక్‌ల వారీగాముఖ్యమైన ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలను తయారుచేసుకుని చదవాలి. ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలను రాసుకునేటపుడు ప్రతి ప్రశ్నకు నాలుగు సమాధానాలను కాకుండా సివిల్స్‌ పరీక్షలో మాదిరిగా వాటికి మరో 4 ప్రత్యామ్నాయాలు అంటే ఎ) 1 మాత్రమే సరైనది బి) 1, 2 మాత్రమే సరైనవి సి) 1, 2, 3 మాత్రమే సరైనవి డి) 1, 2, 3, 4 సరైనవి అని రూపొందించడం వల్ల సన్నద్ధత సమగ్రంగా ఉంటుంది. ఈ పద్ధతిలో సబ్జెక్టును విస్తృతంగా కవర్‌ చేసుకోవచ్చు. తికమక లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయవచ్చు.ఇటీవలి ప్రకటన తరువాత సిలబస్‌ను తెరిచినవారు ఈ పరిమిత సమయంలో సబ్జెక్టులన్నింటినీ ఒకసారి చదవాలి. తర్వాత ప్రతి సబ్జెక్టులోని ముఖ్యాంశాలు చూసుకోవాలి. ఆబ్జెక్టివ్‌ప్రశ్నలను సాధన చేయాలి. మార్కుల ప్రాధాన్యక్రమంలో వివిధ సబ్జెక్టుల ముఖ్యాంశాలను చదవాల్సి ఉంటుంది. ఎక్కువ పుస్తకాలనూ, నోట్సులనూ చదవకుండాసబ్జెక్టు నిపుణులు సూచించినట్లుగా ఒకటి, రెండు ప్రామాణిక గ్రంథాలకు మాత్రమే పరిమితమవటం మంచిది.గ్రూప్‌-2 పరీక్షలోని నాలుగు పేపర్లలోమార్కులపరంగా ఏ సబ్జెక్టుకు అత్యధిక ప్రాధాన్యముందో గుర్తించి ఆ అంశాలపై పట్టు సాధించాలి. ప్రామాణిక మాదిరి ప్రశ్నపత్రాలను సాధన చేసి, స్వీయమూల్యాంకనం చేసుకోవాలి. మార్కుల పరంగా, సిలబస్‌ పరంగా చూస్తే నాలుగు పేపర్ల ప్రాధాన్య క్రమం వరుసగా పేపర్‌-4, 3, 2, చివరగా పేపర్‌-1 ఉంటుంది.పేపర్‌-4తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ముఖ్యాంశాలన్నింటిపై పట్టు సాధించాల్సి ఉంటుంది. ఇతర పేపర్లతో పోలిస్తే సిలబస్‌ పరిమితంగా ఉండడమే కాకుండా ఈ పేపర్‌లో కొన్ని అంశాలు నాటిపరిస్థితులనూ, వివిధ రంగాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాలనూ వివరిస్తాయి.ఈ పేపర్‌లో ఎక్కువ ప్రశ్నలు వచ్చే అంశాలను ముందుగా గుర్తించాలి. అవి ముల్కీ సమస్యలు- నియమాలు- కోర్టుల తీర్పులు- భారతదేశంలో హైదరాబాద్‌ రాజ్య విలీనం- పెద్ద మనుషుల ఒప్పందం- ఫజల్‌ అలీ కమిషన్‌ సూచనలు- చిన్న రాష్ట్రాలపై అంబేడ్కర్‌ అభిప్రాయాలు- 1969 జై తెలంగాణ ఉద్యమం- తెలంగాణలో నక్సల్‌, వామపక్ష ఉద్యమాలు (ముఖ్యమైనవిమాత్రమే). ఇక మూడో విభాగంలోని అంశాలన్నీ ప్రశ్నలపరంగా ముఖ్యమైనవే.అలాగని మిగిలిన అంశాలను వదిలేయమని కాదు. అయితే ఈ అంశాలను సబ్జెక్టు కొనసాగింపు, అవగాహనలకు తప్పకుండా చదవాల్సిందే. ఈ విధంగా సన్నద్ధమైతే

పేపర్‌-4లో గరిష్ఠంగా 80% మార్కులను సాధించగలుగుతారు.తెలంగాణ ఉద్యమంపై పుస్తకాలు, నోట్సులు మార్కెట్‌లో లభ్యమవుతున్నప్పటికీ చాలావాటిలో అనవసర వివరణలకు ప్రాధాన్యంకనపడుతోంది. దోషాలు కూడా ఉంటున్నాయి. అందుకని ఒకటి రెండు ప్రామాణిక గ్రంథాలను మాత్రమే సబ్జెక్టు నిపుణుల, సీనియర్‌ విద్యార్థుల సూచనలతో ఎంచుకోవాలి.

పేపర్‌-3మార్కులపరంగా, పరిమిత సిలబస్‌ పరంగా చూస్తే నాలుగో పేపర్‌ తరువాత ముఖ్యమైనది- భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఆర్థికవృద్ధికి సంబంధించిన మూడో పేపర్‌.మొదటి విభాగం భారతదేశ ఆర్థికవ్యవస్థ సమస్యలు- సవాళ్లకు సంబంధించినది. దీనిలో ముఖ్యంగా వృద్ధి, అభివృద్ధి భావనలపై ప్రశ్నలుంటాయి. రెండో అంశం జాతీయాదాయానికీ, మూడో అంశం పేదరికం, నిరుద్యోగానికి సంబంధించినది. వీటినుంచి ప్రశ్నలు ఎక్కువగా మౌలిక భావనలు, సూత్రాలపై ఆధారపడివుంటాయి. గణాంకాలకు సంబంధించి ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి. ఆ గణాంకాలను శాతాల, నిష్పత్తుల రూపంలో అర్థం చేసుకుని జ్ఞాపకముంచుకోవాలి. అంతేకానీ అన్ని గణాంకాలనూ గుర్తుంచుకోవడం కష్టతరం. యదార్థ గణాంకాలను సబ్జెక్టు అవగాహనకు మాత్రమే చదవాల్సి ఉంటుంది.నాలుగో అంశం పంచవర్ష ప్రణాళికలకు సంబంధించినది. దీనిలో ఈ ప్రణాళికల లక్ష్యాలను, ప్రాధాన్యాలను లక్షిత వృద్ధి రేట్లను, సాధించిన వృద్ధి రేట్లు ముఖ్యం. ప్రణాళిక పెట్టుబడులను తులనాత్మకంగా చదవాల్సి ఉంటుంది. ప్రణాళిక వైఫల్యాలూ, ముఖ్యమైన పథకాలూ ముఖ్యమే. ఇక ప్రణాళికాసంఘ స్థానంలో ఇటీవల స్థాపించిన నీతి ఆయోగ్‌ మరో కీలకాంశం. దీన్నుంచి తప్పనిసరిగా 3- 4 ప్రశ్నలు వచ్చే అవకాశముంది.ఈ పేపర్‌లోని రెండో విభాగం తెలంగాణ ఆర్థికవ్యవస్థకు సంబంధించినది. మొదటి అంశం 1956- 2014 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. అంటే తెలంగాణ ప్రాంత వెనుకబాటుతనం, ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతానికి జరిగిన వివక్షకు సంబంధించి నియమించిన కమిటీలూ, వాటి సూచనలూ ప్రధానం. ఇందులో రెండో అంశమైన తెలంగాణలో భూసంస్కరణలను, చారిత్రక నేపథ్యంతో ప్రస్తుత విధానాలవరకు చదవాలి. ముఖ్యంగా వ్యవసాయ భూపరిమితి చట్టాలూ, వ్యవసాయ భూముల అన్యాక్రాంతాలకు సంబంధించిన అంశాలు. మూడో అంశం- తెలంగాణలోని వ్యవసాయం, నీటిపారుదల సౌకర్యం, మెట్టసాగు సమస్యలను వ్యవసాయ పరపతి సౌకర్యాలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత ఆరంభించిన మిషన్‌ కాకతీయతోపాటుఇతర ప్రాజెక్టులు కూడా దృష్టిపెట్టాల్సినవే. వ్యవసాయ భూకమతాలను, వర్గీకరణలను భూకమతాల వివరాలను అంటే ఉపాంత, సన్నకారు రైతులు మొదలైనవాటిపై అవగాహన పెంచుకోవాలి.చివరి అంశం- తెలంగాణ రాష్ట్ర సేవా పారిశ్రామిక రంగాలు. ఈ పేపర్‌లోని మూడోఅంశం- అభివృద్ధి, మార్పు (పరివర్తన)లకు సంబంధించిన సమస్యలు. ఇందులో ప్రాంతీయ అసమానతలు, వలసలు, నగరీకరణకు సంబంధించిన కారణాలు, సమస్యలు, వాటి పరిష్కారాలకు ప్రభుత్వం రూపొందిస్తున్న వివిధ పథకాలు... ఇవన్నీ పఠనీయం.ఇటీవలి కాలంలో వివాదాస్పదమైన భూసేకరణ విధానాలు, నిర్బంధ భూసేకరణ వల్ల కలిగే సమస్యలు... ముఖ్యంగా పునరావాస చిక్కులూ, పథకాలపై పట్టు సాధించాలి. మరో ముఖ్యాంశం ఆర్థిక సంస్కరణల అమలు, వాటి పర్యవసానాలూ, సామాజిక వృద్ధి, సామాజిక మార్పులు. వీటిని గణాంకాలతోపాటు చదవాలి. చివరి అంశం- సుస్థిరాభివృద్ధికి సంబంధించిన భావనల అభివృద్ధి లక్ష్యాలు. భారతదేశ, తెలంగాణ రాష్ట్ర ఆర్థికాంశాల గణాంకాలను శాతాల రూపంలో జ్ఞాపకం పెట్టుకుని సాధన చేయాలి. నిజానికి చాలామంది మూడో పేపర్‌గురించి భయపడతారు. కానీ వాస్తవానికి ఆర్థిక వ్యవస్థకు చెందిన మౌలిక అంశాలను అర్థం చేసుకుంటే ఈ సబ్జెక్టుపై పట్టు సాధించడం తేలిక.

పేపర్‌-2ఇందులో మూడు విభాగాలకుగానూ నాలుగు సబ్జెక్టులుంటాయి. 1. భారతదేశ, తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర అంటే ఇందులో.. దేశ, రాష్ట్ర చరిత్రలను అధ్యయనం చేయాలి. 2. భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ 3. భారతదేశ, తెలంగాణ సామాజిక నిర్మితి- సమస్యలు, ప్రభుత్వ విధానాలుభారతదేశ చరిత్ర నిజానికి చాలా విస్తృతమైనది. కానీ దీనికి గ్రూప్‌-2 పరీక్షలో 25 మార్కులను మాత్రమే కేటాయించారు. సమయం తక్కువగా ఉన్నందువల్ల భారతదేశ సామాజిక- సాంస్కృతిక చరిత్రలోని ముఖ్యాంశాలను- అంటే ప్రాచీనకాలం నుంచి సింధు నదీలోయ నాగరికతాకాలం నుంచి దేశ స్వాతంత్య్ర సాధనర వరకు సామాజిక ఆర్థిక, సాంస్కృతికఅంశాలను క్రమపద్ధతిలో అధ్యయనం చేయాలి.ఈ విభాగంలోని మరో అంశం... తెలంగాణ- దాని సామాజిక సాంస్కృతిక చరిత్ర. దీని నుంచికూడా 25 మార్కులకుగానూ 25 ప్రశ్నలు వస్తాయి. నిజానికి ఈ మార్కులకు ఈ సిలబస్‌ ఎక్కువే అయినప్పటికీ దేశ చరిత్ర మాదిరే తెలంగాణ చరిత్రను కూడా చదవాలి. దీనికి గత ఏపీపీఎస్‌సీ పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు సాయపడతాయి. తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్రకు సంబంధించి కొంత సిలబస్‌ పేపర్‌-4లో, మరికొన్ని అంశాలు పేపర్‌-1లో ఉన్నాయి. వీటిపై అవగాహన పెంచుకుంటే ఇందులోని 25 మార్కులతోపాటు మరో 25 మార్కుల ప్రశ్నలు తెలుస్తాయి. అంటే దాదాపు 50 ప్రశ్నలు వస్తాయని గుర్తించి ఆ ప్రాధాన్యక్రమంలో దీన్ని చదవాలి.రెండో పేపర్‌లోని రెండో అంశం- భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ నుంచి 50 మార్కులకుగానూ 50 ప్రశ్నలు వస్తాయి. పరీక్షలోని అన్ని సబ్జెక్టుల్లో ఇది ఆసక్తికరమైనది. అయితే సిలబస్‌ చాలా విస్తృతం. ఎక్కువ ప్రశ్నలు రాజ్యాంగంలోని ముఖ్యమైన అంశాలు, సంబంధిత ప్రకరణాల నుంచి వస్తాయి. సుప్రీంకోర్టు తీర్పులకు సంబంధించిన ముఖ్యమైన కేసులపై కూడా ప్రశ్నలుంటాయి. ముఖ్యమైన అంశం- రాజ్యాంగ సవరణలు. దీన్ని క్రమపద్ధతిలో చదివితే 90% మార్కులు అంటే 50 మార్కులకు కనీసం 45 సాధించవచ్చు. రాజ్యాంగానికి సంబంధించిఅనేక ప్రామాణిక ప్రశ్నలను గత సివిల్స్‌, గ్రూప్స్‌ పరీక్షల నుంచి సేకరించి సాధన చేస్తే ఎక్కువ ప్రశ్నలు వాటి నుంచే రావొచ్చు.చివరి అంశం- భారతదేశ, తెలంగాణ సామాజిక నిర్మిత సమస్యలు, విధానాలకు సంబంధించినది. ఈ సబ్జెక్టును మొదటిసారిగా సిలబస్‌లో చేర్చారు. సమాజ సమస్యలపై, వాటి పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించి అమలుచేస్తున్న వివిధ విధానాల పథకాలపై వస్తాయి. సామాజిక ఉద్యమాలపైనా ప్రశ్నలు ఉంటాయి. సామాజిక అంశాలు కూడా ముఖ్యమే. చివరి అంశం- సమాజంలోని వివిధ వర్గాల వారి పురోభివృద్ధికి సంబంధించిన వివిధ సంక్షేమ పథకాలు. వీటిలో కొన్ని మూడో పేపర్‌ అంటే ఎకానమీసబ్జెక్టులోనూ ఉన్నాయి. ఈ సబ్జెక్టుకు సంబంధించి ఎక్కువగా సమస్యల కారణాలు, వాటి పరిష్కారాలు, ప్రభుత్వాల విధానాలు, పథకాలను చదివితే 50కి 40 మార్కులను సాధించవచ్చు.

పేపర్‌-1మొత్తం 150 మార్కులకు 11 సబ్జెక్టులను చదవాల్సి ఉంటుంది. మార్కుల ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ పేపర్‌లో సిలబస్‌ ఎక్కువ, మార్కులు తక్కువ. అంటే కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. అలాగని దీనిలోని అంశాలను నిర్లక్ష్యం చేయడానికి వీలులేదు. విజయం సాధించడానికి ప్రతి ఒక్క మార్కూ ముఖ్యమే కదా! అందుకే పరిమిత సమయంలో మొదటి పేపర్‌లో కూడా గరిష్ఠ మార్కులను సాధించాలంటే క్రమపద్ధతిలో ప్రాధాన్యక్రమంలో చదవటం ప్రధానం.మొదటి పేపర్‌లో మొత్తం 11 సబ్జెక్టులున్నప్పటికీ వీటిలో నాలుగు సబ్జెక్టులు రెండో పేపర్‌లో, కొన్ని మూడో పేపర్‌లో చాలావరకు ఉన్నవే. కాబట్టి ఈ నాలుగు అంశాలకు సంబంధించి కొన్ని ప్రత్యేకాంశాలను మాత్రమే ఇక్కడపట్టించుకుంటే సరిపోతుంది. ఈ పేపర్‌లోని మొదటి రెండు అంశాలు వర్తమాన విషయాలకూ, అంతర్జాతీయ సంబంధాలకూ సంబంధించినవి. వీటికి ఏదైనా జాతీయస్థాయిలో ప్రచురించే ఇంగ్లిష్‌ పత్రిక, రాష్ట్ర వర్తమాన విషయాలకు ప్రామాణిక తెలుగు పత్రికను అనుసరించాలి. వర్తమాన విషయాల కోసం ప్రామాణిక ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలను సాధన చేయాలి. 2016 జనవరి నుంచి చదివితే సరిపోతుంది.మొదటిపేపర్‌లో సాధారణ శాస్త్రీయ విజ్ఞానం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత ప్రగతికి సంబంధించి శాస్త్ర సాంకేతిక అంశాలు ముఖ్యం. ఈ సబ్జెక్టులోని పాఠ్యాంశాలు అపరిమితం. ముఖ్యమైనవాటిపై అవగాహన చాలు.పర్యావరణ సమస్యలు- విపత్తు నిర్వహణకు సంబంధించి ఇటీవల జరిగిన పరిణామాలపై దృష్టి సారించాలి. భౌతిక భౌగోళిక, ప్రపంచ భౌగోళిక, భారతదేశ, తెలంగాణ భౌగోళిక అంశాలపై ప్రశ్నలుంటాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర భౌగోళికాంశాలపై శ్రద్ధవహించాలి. మరో ముఖ్యమైన అంశం- లాజికల్‌ రీజనింగ్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌. వీటి ప్రాథమిక భావనలపై ప్రామాణిక ప్రశ్నలను సాధన చేయాలి. చివరి అంశం- జనరల్‌ ఇంగ్లిష్‌. తెలుగు మాధ్యమం అభ్యర్థులు ప్రాథమిక వ్యాకరణానికి సంబంధించిన ప్రశ్నలు, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌కు సంబంధించిన కొన్ని అంశాలను అభ్యాసం చేయాలి. ఈ విధంగా అన్ని సబ్జెక్టులపై పరీక్షాపద్ధతిలో అవగాహన పెంచుకోవటం ముఖ్యం. ఆపై ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకుని పరీక్షలకు సంసిద్ధమైతే విజయపథంలో ఉన్నట్లే!

మార్కుల పరంగా, సిలబస్‌ పరంగా చూస్తే గ్రూప్‌-2 పరీక్షలోని నాలుగు పేపర్ల ప్రాధాన్య క్రమం వరుసగా పేపర్‌-4, 3, 2, చివరగా పేపర్‌-1. దీనికనుగుణంగా సన్నద్ధతను సాగించాలి.

ఈ పోస్ట్ ఈనాడు పేపర్లో  26-09-2016 రోజు ప్రచురితం అయ్యింది దాని నుండే ఈ పోస్ట్ చెయ్యడం జరిగింది