MY NAME

THIS SITE CREATED BY VENKATESHH AMIRISHETTY

new

subpals

Free YouTube Subscribers

Thursday 22 September 2016

గుడ్ న్యూస్..!! 24 గంటల్లో ఫ్యాట్ కరిగించే న్యాచురల్ రెమిడీస్

బరువు తగ్గడం చాలా పెద్ద టాస్క్ అని ఫీలవుతుంటారు. కానీ.. న్యాచురల్ సప్లిమెంట్స్ ద్వారా బరువు తగ్గడం చాలా ఈజీ. ఈ న్యాచురల్ రెమిడీస్ కి ఒబేసిటీ ఉన్నవ్యక్తి సరైన మోతాదులో తీసుకోవడం వల్ల తేలికగా బరువు తగ్గవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అంతే కాదు.. శరీరంలో ఫ్యాట్ కరిగిపోవడానికి కేవలం 24 గంటలు చాలని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి.
ఈ న్యాచురల్ రెమిడీస్ ఫాలో అవుతూనే.. కొంత ఓర్పుతో వ్యాయామం కూడా రోజూ చేయడం చాలా అవసరమని అధ్యయనాలు చెబుతున్నాయి. కనీసం రోజుకి 45 నిమిషాలు చేయాలట. దీనివల్ల శరీరం యాక్టివ్ గా, ఫిట్ గా ఉంటుంది. అలాగే.. శరీరంలో ఫ్యాట్ చాలా తేలికగా కరిగిపోతుంది.

న్యాచురల్ సప్లిమెంట్స్ అంటే ఏంటి, తినగలిగేవేనా, కష్టపడాల్సి ఉంటుందేమో అని డీలాపడుతున్నారా ? డోంట్ వర్రీ న్యాచురల్ సప్లిమెంట్స్ అంటే.. ఆహారాలే. ఫ్యాట్ బర్నింగ్ ప్రాపర్టీస్ కలిగిన, ఈ ఆహారాల్లో విటమిన్స్, ప్రొటీన్స్, న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇమ్యునిటీ పెంచి, బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అయ్యేలా చేస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం 24 గంటల్లో ఫ్యాట్ కరిగించే సర్ప్రైజింగ్ న్యాచురల్ సప్లిమెంట్స్ ఏంటో చూసేద్దామా..

నీళ్లు

భోజనం తర్వాత గోరువెచ్చని నీళ్లు తాగడం చాలా అవసరం. ఈ అలవాటు వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

గ్రీన్ టీ

గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి, మెటబాలిజం ప్రక్రియకి చాలా మంచిది. కాబట్టి బరువు తగ్గాలనుకుంటే.. ఈ న్యాచురల్ డ్రింక్ ని రోజుకి రెండుసార్లు తాగడం వల్ల శరీరంలో ఫ్యాట్ కరిగిపోతుంది.

సాల్మన్

సాల్మన్ చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ బరువుని న్యాచురల్ గా తగ్గిస్తాయి. వీటిని తీసుకున్న వెంటనే శరీరంలోని కణాల్లో ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ మొదలుపెడతాయి. నట్స్, సీడ్స్ లో కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి.

ప్రొటీన్ ఫుడ్

బరువు తగ్గడానికి ప్రొటీన్ ఫుడ్స్ ఉపయోగపడతాయని మీకు తెలుసా. మీ డైట్ లో ఎక్కువ ప్రొటీన్ ఫుడ్ చేర్చుకుంటే.. మీ శరీరంలో ఫ్యాట్ తగ్గించడం తేలికవుతుంది. అలాగే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి.

డైరీ ప్రొడక్ట్స్

క్యాల్షియం, మినరల్స్ డైరీ ప్రొడక్ట్స్ ద్వారా పొందవచ్చు. క్యాల్షియం బరువు తగ్గడానికి సహాయపడుతుంది. గ్రీన్ వెజిటబుల్స్ కంటే.. పాలు, డైరీ ప్రొడక్ట్స్ ఎక్కువ క్యాల్షియం ఉంటుంది.

విటమిన్ డి

విటమిన్ డి కణాల్లో గ్లూకోజ్ చేరేలే సహాయపడుతుంది. గ్లూకోజ్ ఎనర్జీగా మారడానికి ఇది సహాయపడుతుందన్నమాట. మీరు ఒకవేళ సరైన మోతాదులో సూర్యరశ్మి పొందలేకపోతే.. ఫిష్ ఆయిల్ తీసుకోవడం మంచిది.

దాల్చిన చెక్క

స్పైసీగా ఉండే దాల్చిన చెక్కలో శరీరంలో ఫ్యాట్ కరిగించే సత్తా ఉంది. చెక్క ఉపయోగించే ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గిస్తుంది.

కారం

బరువు తగ్గించడంలో కారం చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. చాలా త్వరగా బరువు తగ్గాలి అనుకుంటే.. మీ వంటకాల్లో కారం ఎక్కువగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల ఎక్కువ చెమట పట్టి.. క్యాలరీలు కరిగిపోతాయి.
<h3సముద్రపు పాచి=”” <=”” h3=””>
ఈ న్యాచులర్ సప్లిమెంట్ 24 గంటల్లో బరువు తగ్గిస్తుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. మీ శరీరంలో విటమిన్స్ పెంచడానికి, బరువు తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుందట.


No comments:

Post a Comment