పురుషులకు ఉండాల్సిన లక్షణాలు కొన్ని వున్నాయి. అందులో కోన్ని మంచి లక్షణాలు ఉండవచ్చు ,కోన్ని చెడు లక్షణాలు ఉండవచ్చు. కాని స్త్రీలు ఎక్కువగా మంచి లక్షణాలు ఉన్నవారినే ఇష్టపడతారు. మంచి డ్రెస్సింగ్ సెన్స్, ఆర్థిక పరంగా నిలదొక్కుకోగలిగే సామర్థ్యం, ఎల్లప్పుడూ నీట్‌గా ఉండే తత్త్వం అంటే స్త్రీలకు ఎక్కువగా నచ్చుతాయట. అలాగే పురుషుడి నుంచి మహిళ విశ్వాసాన్ని ఆశిస్తుందని, తనపై నమ్మకాన్ని ఉంచాలని ఆశిస్తుందని మానసిక వైద్య నిపుణులు అంటున్నారు.
అలాగే పురుషుల నుంచి వచ్చే సువాసనకు చాలామంది మహిళలు ఆకర్షితులవుతున్నారని తాజా అధ్యయనంలో వెల్లడించారు. వ్యక్తిగతం పరిశుభ్రంగా మంచి సువాసనతో ఉన్నపురుషులు ఇతర లక్షణాల్లో కూడా ప్రాధాన్యత కలిగి ఉంటారని స్త్రీలు నమ్ముతారు. ఆర్థికపరమైన విషయంలో స్త్రీలు సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. ఆర్ధికపరంగా నిలదొక్కుకొనే సత్తా అతనిలో ఉందా లేదా అని చూస్తారు. అదే వారు కోరుకుంటారు. ఇక ఫర్ఫెక్ట్ బాడీ షేప్, హ్యాండ్సమ్ పర్సన్ భర్తగా, బాయ్ ఫ్రెండ్‌గా స్త్రీలు కోరుకుంటారని సైకాలజిస్టులు తాజా అధ్యయనంలో వెల్లడించారు
Thursday, 22 September 2016
స్త్రీలకు ఈ లక్షణాలు ఉన్న యువకులే ఇష్టమట
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment