MY NAME

THIS SITE CREATED BY VENKATESHH AMIRISHETTY

new

subpals

Free YouTube Subscribers

Wednesday 21 September 2016

కిడ్నీ ఫెయిల్యూర్, కిడ్నీ డ్యామేజ్ ని ముందు గానే గుర్తించండి–ప్రతి ఒక్కరూ తప్పక చదవలి

మన శరీరంలో కిడ్నీలు అత్యంత ప్రముఖ పాత్రను వహిస్తాయి. ముఖ్యంగా మన శరీరంలోని వేస్ట్ ప్రొడక్ట్స్ (వ్యర్థాల)ను యూరిన్ రూపంలో బయటికి పంపించేస్తుంది . ఇది శరీరంలో ద్రవాలను మరియు ఎలక్ట్రోలైట్స్ ను సమతుల్యం చేస్తుంది. శరీరంలోకి ప్రవేశించే అన్ని రకాల టాక్సిన్స్ ను శరీరం నుండి బయటకు నెట్టివేస్తుంది. మన శరీరానికి అవసరం అయ్యే అత్యంత ముఖ్యమైన గ్లూకోజ్, బ్లడ్ సెల్స్, విటమిన్స్, మరియు మినిరల్స్ ను మనం తీసుకొనే ఆహారాల ద్వారా గ్రహించి, నిల్వచేస్తుంది.
అదేవిధంగా, యూరిన్ లో ఇలాంటి ముఖ్యమైన పోషకాలు ఏవైనా కోల్పోతున్నారంటే, కిడ్నీలకు సంబంధించే ఏదో సమస్య ఉన్నట్లుగా గుర్తించాలి. లేదా ఇవి రక్తంలో అత్యధికంగా ఉన్నట్లు గుర్తించాలి.
ఉదాహరణకు, రక్తంలో బ్లడ్ షుగర్ అధికంగా ఉన్నప్పుడు, డయాబెటిస్ ఉన్నట్టైతే యూరిన్ లో గ్లూకోజ్ కోల్పోవడం జరుగుతుంది . కొన్ని సాధారణంగా యూరిన్ లో గ్లూకోజ్ కోల్పోకూడదు. మూత్ర విసర్జన ద్వారా శరీరంలో జరిగే అనేక అనారోగ్య సమస్యలను గుర్తించవచ్చు. ఉదాహరణకు కిడ్నీ సమస్యలను గుర్తించవచ్చు. కిడ్నీలు శరీరంలో వ్యర్ధాలన్నింటిని వడపోస్తుంది, ఇంకా మరోన్నె క్రియలను నిర్వర్తిస్తుంది. కాబట్టి, కిడ్నీలు మన శరీరానికి ఒక ఇంజన్ లా పనిచేస్తుంది. మరి ఈ మన ప్రాణాలను నిలిపే కిడ్నీ ఇంజన్ డ్యామేజ్ అవ్వడానికి కొన్ని కామన్ హ్యాబిట్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి….
కిడ్నీ ఫెయిల్యూర్, కిడ్నీ డ్యామేజ్ కు కారణమయ్యే రెగ్యులర్ హ్యాబిట్స్ ..!
యూరిన్ కు సరిగా, తరచూ వెల్లకపోవడం:
అర్జెన్సీ ఉన్నప్పుడు వెంటనే యూరిన్ పాస్ చేయడం వల్ల బ్లాడర్ మీద ఒత్తిడి తగ్గుతుంది. అలా కాకుండా యూరిన్ అర్జెన్సీ ఉన్నా తర్వాత వెళ్ళచ్చొలే అని పనుల్లో పడితే మాత్రమం బ్లాడర్ కు అధిక పనిపెట్టినట్లే, అంతే కాదు కిడ్నీ డ్యామేజ్ మరియు కిడ్నీ ఫెయిల్యూర్ కు కారణం అవుతుంది.
ఎక్కువ ఉప్పు తినడం:
ఎక్కువ ఉప్పు తినడం వల్ల బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. ఇది కిడ్నీల మీద ఒత్తిడి పెంచుతుంది హైబ్లడ్ ప్రెజర్ తో బాధపడే వారు , హైబ్లడ్ ప్రెజర్ కు గురైనప్పుడు వెంటనే కిడ్నీ చెకప్ కూడా చేయించుకోవడం మంచిది.హైబ్లడ్ ప్రెజర్ కూడా కిడ్నీ హెల్త్ మీద ప్రభావం చూపుతుంది.
ఎక్కువ సాఫ్ట్ డ్రింక్స్ లేదా కాఫీ త్రాగడం:
కాఫీ మరియు సాష్ట్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల వాటిలో ఉండే కెఫిన్ కిడ్నీలకు డ్యామేజ్ కలిగిస్తుంది . ఇది బ్లడ్ ప్రెజర్ కూడా కారణం అవుతుంది . ఇది కిడ్నీల మీద ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది.
సరిగా నీరు త్రాగకపోవడం:
చాలా మంది రోజుకు సరిపడా నీరు త్రాగరు, ఈ విషయంలో , కిడ్నీలో కొన్ని వ్యర్థాలు అలాగే ఉండిపోవడం వల్ల కిడ్నీ డ్యామేజ్ కు కారణం అవుతుంది. . ఈ టాక్సిన్స్ రక్తంతో కలిసిపోయి, శరీరంలో ఇతర అవయవాలను కూడా డ్యామేజ్ చేస్తుంది. అందవువల్ల శరీరానికి రోజుకు సరిపడా నీరు తాగడం వల్ల శరీరంలో టాక్సిన్స్ ను తొలగించుకోవచ్చు.
విటమిన్ బి6 లోపం:
కిడ్నీలు ఆరోగ్యంగా పనిచేయాలంటే విటిమన్ బి6 అవసరం అవుతుంది . బి6లోపించడం వల్ల కిడ్నీ స్టోన్స్ ను పెరుగుతాయి. విటమిన్ బి6 ఎక్కువగా ఉన్న చిక్ పీస్, లివర్ ఫ్రూట్స్, బంగాళదుంప వంటి స్ట్రాచీ ఫుడ్స్ తీసుకోవాలి.
మెగ్నీషియం లోపం:
ఈ మినిరల్ కూడా కిడ్నీఆరోగ్యానికి చాలా అవసరం అవుతుంది . మెగ్నీషియం శరీరంలో క్యాల్షియం గ్రహించడానికి మరియు శరీరం మొత్తం క్యాల్షియంను సప్లై చేయడానికి చాలా అవసరం అవుతుంది. మెగ్నీషియం ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీల్లో క్యాల్షియం స్టోర్ కాబడి, కిడ్నీ స్టోన్స్ గా రూపాంతరం చెందుతాయి
పెయిన్ కిల్లర్స్:
ఎక్కువగా, ఫ్రీక్వెంట్ గా పెయిన్ కిల్లర్స్, ఎక్కువ డోస్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అధికంగా ఉంటాయి. ఈ పెయిన్ కిల్లర్స్ అన్నీ ఫార్మాసూటికల్ డ్రగ్స్ తో తయారుచేయడం వల్ల కిడ్నీల మీద ప్రభావం చూపుతుంది.
ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోవడం:
రీసెర్చ్ ప్రకారం ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి . ఎక్కువ ప్రోటీన్స్ డైజెషన్ వల్ల అమ్మోనియా విడుదతలవుతుంది. ఇది కిడ్నీ టాక్సిన్స్ కు కారణం అవుతుంది. ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీల మీద ఎక్కువ ప్రభావం పడుతుంది . ఇది కిడ్నీ ఫంక్షన్ ను పెంచుతుంది.
ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం:
ఆల్కహాల్ లో కనుగొన్న కొన్ని టాక్సిన్ లివర్ ను డ్యామేజ్ చేయడం మాత్రమే కాదు కిడ్నీలను కూడా డ్యామేజ్ చేస్తాయి. ఇవి కిడ్నీల పనితీరును పెంచేస్తుంది . తర్వాత నిధానంగా కిడ్నీలు డ్యామేజ్ కు కారణం అవుతుంది.

No comments:

Post a Comment