MY NAME

THIS SITE CREATED BY VENKATESHH AMIRISHETTY

new

subpals

Free YouTube Subscribers

Thursday 22 September 2016

మీరు బరువు తగ్గడానికి 10 ఇంటి చిట్కాలు–ప్రతి ఒక్కరూ తప్పక చదవాలి

ఈ మధ్య ప్రపంచీకరణ ప్రభావంతో రెస్టారెంట్లు, మెక్ డొనాల్డ్ లాంటివి పెరిగిపోయాయి. ఆధునిక జీవన శైలి వలన మనకు తెలియకుండానే బరువు పెరుగుతున్నాము. కూర్చొని పని చేసే ప్రతి ఉద్యోగి, వ్యాపారి కూడా తన బరువు మీద కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 35 దాటిన వాళ్ళు తమ బరువు మీద నియంత్రణ కలిగి ఉండాలి. బరువు పెరగటం వల్ల పొట్ట వద్ద, తొడల దగ్గర కొవ్వు పేరుకొని, గడ్దం క్రింద చర్మం వేలాడుతూ అసహ్యంగా తయారు అవుతాము. చర్మం కూడా బాగా సాగుతుంది. ఒక్క కేజీ బరువు పెరగటానికి ఎంతో సమయం పట్టదు. కానీ అదే ఒక్క కేజీ బరువు తగ్గటానికి వ్యాయామశాలకు వెళ్ళి, రోజు అర గంట పరుగెత్తి, కడుపును పస్తులు పెట్టి నానా అవస్థలు పడాలి. ఇన్ని అవస్థలు మనకు అవసరమా!! కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా మనము బరువు చూసుకొంటూ ఉండాలి. మీరు స్థూలకాయస్తులా కాదా అనడానికి ఒక చిన్న లెక్క ఉంది. శివ 170cm పొడవు ఉన్నాడు, అతను ఎక్కువంటే (170 – 100 = 70Kgలు) ఉండవచ్చు. మన చేతి ఎముకలు సన్నవా, లావువా అని చూసి ఒక +/-5kgలు అటూ ఇటూ సర్దుకోవచ్చు. దాని దాటితే స్థూలకాయస్తుల జాబితాలో చేరినట్టే.
దీన్ని జయించాలంటే, రోజు వారిలో మనం కొన్ని అలవాటులు మార్చుకోవాలి. అంతే కాక మనస్సు రక రకాల రుచుల మీదకు పోకుండా నియంత్రించుకోవాలి. వాటి కోసం కొన్ని చిన్న చొట్కాలను పంచుకొంటున్నాను
1. చిన్న తట్టలో (పళ్ళెం) తినండి. మీకు తెలీకుండానే మీరు తక్కువ తినడం ప్రారంభిస్తారు.
2. భోజనానికి 30 నిముషాల ముందు నీళ్ళు బాగా త్రాగండి. ఆకలి ప్రభావం అంతగా తెలియదు. భోజనానికి రెండు గంటల తరువాత కనీసం 30 నిముషాలకు ఒక్కసారి నీళ్ళు త్రాగండి.
3. రోజులో తక్కువ ప్రమాణంలో ఎక్కువ సార్లు తినండి. కప్పుడు అన్నంతో పాటూ ఉడకబెట్టిన కూరగాయలు, మొలకలు ఉండేలా చూసుకోండి. రాత్రి మాత్రం ఒక్క చపాతి చాలు. ఆకలేస్తే ఏ పచ్చి క్యారెట్టో, ఆపిలు పండో తినండి. (ఆహారపు అలవాట్ల గురించి విఫులంగా ఇంకో టపాలో వ్రాస్తా)
4. నోరు కట్టేసుకోవడం మా వల్ల కాదు అనేవాళ్ళు ఏదైనా తినండి ఐతే కొద్దిగా తినండి. తినేది ఒక్క బజ్జీయే అయినా నెమ్మదిగా తింటూ దాని రుచిని ఆస్వాదించాలి. చిరు తిండ్లు, తీపి పదార్థాలు తినవలసి వస్తే…నిరభ్యరంతరంగా తీసుకోండి. ఐతే ఒకటికి మించి వద్దు. లేకపోతే [[అహ నా పెళ్ళంట]] సినిమాలో కోటాను అనుసరించాలి
5. వారం మొత్తం నూనె పదార్థాలు లాంటివి పత్యం ఉన్నందుకు ప్రతిఫలంగా ఆదివారం మధ్యాహ్నం మీకిష్టమొచ్చింది తినండి. అంటే ఏదైనా స్పెషల్ తినల్ల అంటే ఆదివారం కోసం ఎదురు చూడాల్సిందే.
6. లిఫ్టు ఎక్కవద్దు, ఎన్ని అంతస్థులైనా సరే, ఎన్ని సార్లయినా సరే మట్లే ఎక్కండి. (కీళ్ళ వ్యాధులు ఉన్న వాళ్ళు వైద్యుని సలహా తీసుకోండి). బస్సు దిగాల్సిన స్థానం కన్నా ఒక స్థానం (stop) ముందే దిగెయ్యండి.
7. ఆహారాన్ని నెమ్మదిగా తీసుకోండి. ఆత్రం వద్దు. ఆత్రంగా అన్నీ కుక్కేసుకోవడం కంటే, తినే ఒక్కదాన్నే తింటూ దాని రుచిని మెల్లగా ఆస్వాదించండి.
8. ఫలాల రోజు, కూరాగాయల రోజు, మొలకల రోజు లాంటివి ప్రతి నెలా జరుపుకోండి. ఆ రోజు తాజా పండ్లు, కూరగాయలే మాత్రమే తినండి .
9. నేను ఫలానా పది కేజీల బరువు తగ్గ దలుచుకున్నాను అని స్నేహితులు అందరికీ చెప్పండి. ఒక వేళ బరువు తగ్గాడానికి జాగ్రత్తలు తీసుకోకపోతే జనాలు అడుగుతున్నప్పుడైనా చురుక్కుమని తగిలి కర్తవ్యం గుర్తు వస్తుందిటి.
10. అన్నిటికన్నా ముఖ్యం, బరువు తగ్గాలన్న అత్యుత్సాహం వద్దు. అత్రుత్సాహం ఉంటే ఆరంభశూరుగానే మిగులుతారు. అలవాటులన్నీ మెల్లమెల్లగా మార్చుకోవాలి. ఇది ముఖలో మొదలుపెట్టి పుబ్బలో ముగించే కార్యక్రమంలా కాక, జీవితాంతం ప్రతి ఒక్కరోజూ పాటించే అలవాటుగా మార్చుకోండి.
అందరికీ షేర్ చెయ్యండి
ఇట్లాంటి ఉచిత సలహాలను ఎన్నని గుర్తు పెట్టుకోవాలి అనే అడిగేవారికి కొసరుగా మూడు గుడ్డి గుర్తులు
1) ఎప్పుడూ సగం కడుపుకే తినండి. అంట పొట్టలో సగం ఆహారం ఉంటే, మిగతా సగం గాలి, నీరు ఉండాలన్నా మాట.
2) సాధ్యమైనంతవరకు యంత్రాలు ఉపయోగించడం మానెయ్యండి.
3) వేపుళ్ళు, పాల ఉత్పత్తులు పూర్తిగా మానెయ్యండి, అస్సలు ముట్టుకోవద్దు.
(హెచ్చరిక: ఇది స్వయం అనుభవాలతో ఇస్తున్న సలహాలే కానీ వైద్యుని చికిత్సకు ప్రత్యామ్నాయాలు కావు)

No comments:

Post a Comment