MY NAME

THIS SITE CREATED BY VENKATESHH AMIRISHETTY

new

subpals

Free YouTube Subscribers

Thursday 22 September 2016

నిద్రపట్టడంలేదా ? అయితే ఇది ట్రై చేయండి

మనం తినే ఆహార పదార్ధాలలో క్యాబేజీ చాలా శ్రేష్ఠమైనదని వైద్యులు చెబుతున్నారు. క్యాబేజీ వల్ల రక్తంలో చక్కెర స్థాయి సమతుల్యంగా ఉంటుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. రక్తంలో కొవ్వు నిల్వలు పేరుకుపోకుండా అదుపుచేసే – గ్లూకోజ్ టాలరెన్స్లో భాగమైన– క్రోమియం వీటిలో పుష్కలంగా ఉంటుంది.ఇక నిద్రలేమితో బాధపడుతున్నవారు క్యాబేజీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆసమస్యనుంచి బయటపడొచ్చు. ఎందుకంటే ఇందులో ఉండే లాక్ట్యుకారియం అనే పదార్థం నిద్రలేమిని దూరం చేస్తుంది.క్యాన్సర్ను నిరోధించడానికి కూడా క్యాబేజీ ఔషధంలా పనిచేస్తుంది. శరీరానికి అవసరమైన ఫ్లేవనాయిడ్స్ వీటిలో సంవృద్ధిగా ఉంటాయి. వాటి ద్వారా పాంక్రియాటిక్ గ్రంథి క్యాన్సర్ను క్రమంగా తగ్గించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.క్యాబేజీని క్రమం తప్పకుండా తింటూ ఉంటే స్థూలకాయం అదుపులో ఉంటుంది… అతిగా పొగ తాగేవారి శరీరంలో కలిగే దుష్ఫభావాల తీవ్రతను క్యాబేజీ తగ్గిస్తుంది. సో.. క్యాబేజీని వీలైనపుడల్లా.. మీ ఆహారపదార్ధాలతో పాటుగా తీసుకోండి. అనారోగ్యాలకు చెక్ పెట్టండి.

No comments:

Post a Comment