MY NAME

THIS SITE CREATED BY VENKATESHH AMIRISHETTY

new

subpals

Free YouTube Subscribers

Wednesday 21 September 2016

ముక్కుపుడక లేదా ముక్కెర యొక్కగొప్పతనం

ముక్కుపుడక లేదా ముక్కెర ఒక విధమైన ముక్కుకు ధరించే ఆభరణము. ముక్కుపుడక ధరించడం సంపంగిలాంటి ముక్కుకు కొత్తవింత అందాన్ని ఇస్తుంది.దీనిని ఎక్కువగా స్త్రీలు ధరిస్తారు. అనేక ప్రాంతాలలో ముక్కుపుడక పెళ్ళి అలంకారాలలోనే ఎక్కువగా కనిపిస్తుంది.ముక్కెరను తమిళంలో ముక్కుట్టి, హిందీలో నాత్ లేదా నాథురి, బీహారీలో లాంగ్ అని పిలుస్తారు.పురాణాలు :ముక్కుపుడక అంటే మహిళలకు ఎంత మక్కువో తెలియాలంటే పురాణాలలోని ఎన్నో ఉదాహరణలు ఇవ్వచ్చు.భామాకలాపంలో ఒకసారి సత్యభామ చెలికత్తెను శ్రీకృష్ణుని వద్దకు రాయబారం కోసం వెళ్ళమంటుంది.ఎన్ని లంచాలు ఇస్తానన్నా, ఎన్ని నగలుఇస్తానన్నా వెళ్లనంటుంది. విసిగిన సత్య చివరకు అసలు నీకేం కావాలో చెప్పవే అని అడిగితే సత్యభామ ముక్కున ఉన్న ముక్కెర కావాలంటుంది.అది ఇవ్వగానే లంకెబెందెలు దొరికినంతసంతోషమ్గో శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి రాయబారం నడుపుతుంది.హిందూ దేవతలు అందరికీ ముక్కెర తప్పకుండా ఉంటుంది. బెజవాడ కృష్ణానది పొంగి కనకదుర్గమ్మ ముక్కెరను తాకితే భూమి మీద ఎవ్వరూ మిగలరని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారు కాలజ్ఞానంలో చెబుతారు.సాంప్రదాయం :అలంకారంగా స్థిరపడిన ముక్కెరను మేనమామ లేదా కాబోయే భర్త మాత్రమే బహూకరించడం అనేది ప్రాచీన కాలంనుంచీవస్తున్న సాంప్రదాయం. బయటి వాళ్ళెవరైనా ఇవ్వజూపితే అది చాలా తప్పు.ఒకవేళ వాళ్ళనుంచి తీసుకున్నారు అంటేవాళ్ళు దేవదాసీలై ఉంటారు. ఎందుకంటే ఇది భర్త ప్రేమకు గుర్తు. అందుకే ‘మగని ప్రేమకే గుర్తు మగువ ముక్కుపుడక’ అన్నాడో కవి.తాళిబొట్టు మాదిరిగానే వివాహసమయంలో ధరించిన ముక్కుపుడకను జీవితాంతం తీయరు కొందరు. అది ఉన్నంతకాలం భర్త క్షేమంగా ఉంటాడన్నది వారి నమ్మకం.అందుకే దీన్ని సౌభాగ్యానికి సంకేతంగా చెబుతారు.భార్య పెట్టుకున్న ముక్కుపుడక బరువు, సైజు, డిజైన్ భర్త ఆర్థిక స్తోమతను తెలిపేవిగా ఉండేవి. రాజుల వంశానికి చెందిన మహిళల ఆభరణాల్లో ఒకటి నుండి 17 వరకు వివిధ రత్నాలు ఉన్న ముక్కుపుడకలు ఎన్నో ఉండేవి.పూర్వకాలంలో ఏడేళ్ళ వయసులోనే ముక్కుకుట్టించి బంగారుతీగ చుట్టించేవారు.పెరిగిన తర్వాత దాన్ని తీసి రాళ్ళు పొదిగిన పుడకలు పెట్టేవారు.ఎంత పేదవారైనా దీనిని మాత్రం బంగారంతోనే చేయించుకుంటారు. దక్షిణ భారతదేశంలో దీన్ని ఎక్కువగా కుడివైపు పెడితే, ఉత్తరాదిన మాత్రం ఎడమవైపు పెడుతుంటారు.ఈ ప్రస్తుతకాలంలో కూడా పెద్ద ముత్యపు ముక్కెరను మరాఠీ మహిళలు చాలా ఇష్టంగా ధరిస్తారు. కొందరిలో ఇది దాదాపు గడ్డం వరకు వస్తుంది.ఇప్పటికీ కొందరు ఆదివాసులలో పెద్దవైన బులాకీలు వాడతారు.

No comments:

Post a Comment