MY NAME

THIS SITE CREATED BY VENKATESHH AMIRISHETTY

new

subpals

Free YouTube Subscribers

Thursday 22 September 2016

ఆన్‌లైన్‌లో ఓటరు గుర్తింపు కార్డుకు దరఖాస్తు (అప్లై) చేయటం ఏలా..

భారత ప్రభుత్వం, 18 సంవత్సరాలు నిండిన తమ పౌరులకు తప్పనిసరిగా జారీచేయవల్సిన ధృవీకరణ పత్రాల్లో ఓటర్ ఐడీ ఒకటి. 18 సంవత్సరాలు నిండిన ప్రతిభారతీయుడు ఓటర్ ఐడీ కోసం ధరఖాస్తు చేసుకోవచ్చు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇది లైసెన్స్ లాంటింది.అంతేకాదు, అనేక లీగల్ డాక్యుమెంటేషన్లలో ఓటర్ ఐడీ కార్డ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఒకప్పుడు ఓటు గుర్తింపు కార్డును పొందాలంటే కనీసం 6 నెలల సమయం పట్టేది. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞాణం, ఓటర్ ఐడీ జారీ ప్రక్రియనుమరింత సులభతరం చేసేసింది. ఓటు గుర్తింపు కార్డుకు ఆన్లైన్ ద్వారా ధరఖాస్తు చేయటం ద్వారా బోలెండత సమయంఆదా అవటంతో పాటు ఇతర బెనిఫిట్లను కూడా పొందవచ్చు.భారత ఎలక్షన్ కమీషన్ నిబంధనల ప్రకారం ఒక్కో పౌరుడు ఒక ఓటర్ ఐడీని మాత్రామే కలిగి ఉండాలి. ఓటర్ ఐడీ కార్డ్ కోసం ఆన్లైన్లో ధరకాస్తు చేసుకునే క్రమంలో సంబంధిత ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ధరఖాస్తు చేసుకున్న ఓటర్ ఐడీ నేరుగావ్యక్తి చిరునామాకే డెలివరీ చేయబడుతుంది. ఆన్లైన్ ప్రాసెస్లో ఓటర్ ఐడీకి ధరఖాస్తు చేసుకువటం ద్వారా కేవలం నెల రోజుల వ్యవధిలో ఓటు గుర్తింపు కార్డును పొందవచ్చు. ఆఫ్లైన్ ప్రాసెస్లో ఈ ప్రక్రియకు 8 నుంచి 9 నెలల సమయం పట్టొచ్చు. ఆన్లైన్లో ఓటు గుర్తింపు కార్డుకు ధరఖాస్తు చేసుకునేందుకు అప్లికేషన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది…

స్టెప్ – 1:

ముందుగా ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా అదికారిక వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.http://www.nvsp.in/index.html

స్టెప్ – 2:

వెబ్సైట్ హోమ్ పేజీలో కనిపించే Apply online for Registration of new Voter అనే టాబ్ పై క్లిక్ చేయండి.

స్టెప్ – 3:

Form 6తో కూడిన ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్లో మీ రాష్ట్రం, పార్లమెంటరీ నియోజికవర్గ పరిధి, పేరు, పుట్టిన తేదీ, జన్మ స్థలం వివరాలను పొందుపరచటంతో పాటు ఫోటో తదితర సపోర్టింగ్ డాక్యుమెంట్లను అప్లోడ్ చేయవల్సి ఉంటుంది.Form 6ను పూర్తిగా ఫిల్ చేసిన తరువాతఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని submit బటన్ పై ప్రెస్ చేయండి.మీ అప్లికేషన్ ప్రాసెస్ విజయవంతంగా పూర్తి అయినట్లయితే, అప్లికేషన్లో మీరు వెల్లడించిన ఈ-మెయిల్ ఐడీకి, ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా నుంచి ఓ లింక్ అందుతుంది. ఆ లింక్ పై క్లిక్ చేసినట్లయితే మీ పర్సనల్ ఓటర్ ఐడీ పేజీకి రీడైరక్ట్ అవుతారు.మీ మెయిల్ కు వచ్చిన లింక్ ద్వారా మీఓటర్ ఐడీ సంబంధించిన స్టేటస్ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

No comments:

Post a Comment