MY NAME

THIS SITE CREATED BY VENKATESHH AMIRISHETTY

new

subpals

Free YouTube Subscribers

Thursday 22 September 2016

మంగళసూత్రంలో నల్లపూసలు ప్రాధాన్యత

స్త్రీ ఒక సంవత్సర కాలం సంతానాన్ని తన గర్భంలో మోసి మరొక ప్రాణికి జన్మనిస్తుంది. అందువల్ల స్త్రీ నాడులకు అనుకూలమైన పదార్ధాలను ఆమెకు ఆభరణాలుగా ఏర్పాటు చేశారు. వాటిల్లో నల్లపూసలు ఒకటి. ముత్తైదువులు ధరించే ఆభరణాలు వారి దేహంపై ఆధ్యాత్మికంగాను, వైజ్ఞానికంగాను ఉత్తమ పరిణామాల్ని కలిగిస్తాయి. సకలదేవతల సన్నిధానాయుప్తమైన, సకలతీర్ధాల సన్నిధానం కలిగిన, సౌభాగ్యాలనొసగే తాళి మాంగల్యం ముత్తైదువకు ముఖ్యమైనది.
వెనుకటి కాలంలో నల్లపూసలను నల్లమట్టితో తయారు చేసేవారు. ఆ నల్లపూసలు ఛాతీమీద ఉత్పన్నమయ్యే ఉష్ణాన్ని పీల్చుకునేవి. అదికాక పిల్లలకు పాలిచ్చే తల్లులలో పాలను కాపాడుతాయని నమ్మకం. ఇప్పుడు నల్లపూసలు వేసుకోవడమే తక్కువ. మనదేహంలోని ఉష్ణంతో బాటు బంగారు గొలుసు వేసుకోవడం వల్ల ఇంకా వేడిపెరిగి శరీరం వివిధ రుగ్మతలకు నిలయమౌతుంది. ఇక ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు హృదయ మధ్య భాగంలో అనాహత చక్రం ఉంది. గొంతు భాగంలో సుషుమ్న మరియు మీద భాగంలో విశుద్ధ చక్రం ఉంది. ఈచక్రాలపై నల్ల పూసలు ఉన్నందువల్ల హృదయం, గొంతు భాగంలో ఉష్ణం సమతులనమై రోగాలు పరిహారమౌతాయి. ఇటువంటి పవిత్రమైన మంగళసూత్రాన్ని భర్తకు తప్ప అన్యులకు కనిపించేలా పైన వేసుకోరాదు. వేరొకరి దృష్టి పడితే మంచిది కాదు. స్త్రీలు నల్లపూసలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడమనేది ప్రాచీన కాలం నుండి వస్తుంది.
నల్లపూసలు ఎంతో విశిష్టమైనవిగా పవిత్రమైనవిగా.. భావించడమనేది మన ఆచార వ్యవహారాలలో ఒక భాగమై పోయింది. ఇటీవల కాలంలో నల్లపూసల తాడును ప్రత్యేకంగా చేయించుకొని ధరించడం జరుగుతుందిగానీ, పూర్వం మంగళ సూత్రానికే నల్లపూసలను అమర్చేవారు. వివాహానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ నలుపు రంగును పక్కన పెడుతూ వచ్చిన వారు, సరాసరి నల్ల పూసలను మంగళసూత్రానికి అమర్చడం పట్ల కొంతమంది అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటారు.
అయితే నల్లపూసల ధారణ అనే మన ఆచారం వెనుక శాస్త్ర సంబంధమైన కారణం లేకపోలేదు. వివాహ సమయంలోనే వధువు అత్తింటి వారు, ఓ కన్యతో మంగళసూత్రానికి వధూవరులచే నీలలోహిత గౌరికి పూజలు చేయిస్తారు. ఈ విధంగా చేయడం వలన నీలలోహిత గౌరీ అనుగ్రహంతో వధువు యొక్క సౌభాగ్యం జీవితకాలం పాటు స్థిరంగా ఉంటుందని శాస్త్రం చెబుతుంది.
నాకువివాహమును, సౌభాగ్యమును, ఆరోగ్యమును , పుత్రలాభమును ప్రసాదించెదవు గాక..! అని ప్రార్ధించి నీలలోహిత పూజను చేసి నీలలోహితే……భధ్యతే అనే మంత్రాన్ని చెప్పి ముత్యముల చేతనూ, పగడముల చేతనూ కూర్చబడిన సూత్రమును కట్టాలి. నీలలోహిత గౌరిని పూజించడం వలన…ఆమె సన్నిధిలో ఉంచిన నల్లపూసలను ధరించడం వలన వధూవరులకి సంబందించిన సర్పదోషాలు తొలగిపోతాయని శాస్త్రం అంటోంది. అందువలన నల్లపూసలను ఓ ప్రత్యేక ఆభరణంగా భావించి ధరించకుండా, అవి మంగళ సూత్రంతో కూడి ఉండాలని స్పష్టం చేస్తోంది.

No comments:

Post a Comment