MY NAME

THIS SITE CREATED BY VENKATESHH AMIRISHETTY

new

subpals

Free YouTube Subscribers

Sunday 18 September 2016

4జి ఎల్‌టీఈ నెట్‌వర్క్‌ను హ్యాక్ చేసిన స్కూల్ విద్యార్థి

వర్జీనియా హైస్కూలు స్టూడెంట్ తన మొదడుకు పదునుపెట్టాడు. కాసంత తీరిక దొరకడంతో టి-మొబైల్‌లోని 4 జి ఎల్‌టీఈ నెట్‌వర్క్‌ను సక్సెస్‌ఫుల్‌గా ‘హ్యాక్’ చేశాడు. డాటా ప్లాన్‌ లేకుండానే ఉచితంగా ఇంటర్నెట్‌‌ను వినియోగించుకున్నాడు . వినడానికి ఒకింత ఆశ్చర్యంగా ఉన్నా…ఫన్ ఛాలెంజ్‌లో భాగంగా జాకోబ్ అజిత్ అనేఈ పదిహేడేళ్ల కుర్రాడు దీన్ని సాధించగలిగాడు. డాటా ప్లాన్ లేకుండా ఇంటర్నెట్‌ను ఉపయోగించవచ్చా లేదా చెక్ చేసేందుకు ఈ కుర్రాడు ప్రీపైయిడ్ సిమ్, స్పేర్ ఫోను ఉపయోగించాడు. ఆ ప్రయత్నం ఆశాజనకంగా ఉండటంతో మరింత ముందుకెళ్లి టీ మొబైల్ నెట్‌వర్క్‌లోని హిడెన్ జెమ్స్‌ను విజయవంతంగా అన్‌లాక్ చేశాడు.రెండేళ్ల క్రితం ఓ టీనేజర్ పెంటగాన్వెబ్‌సైట్‌ను హ్యాక్ చేయడం అందరికీ గుర్తుండే ఉంటుంది. తాజాగా జాకోబ్ అజిత్ లీడింగ్ టెలికాం కంపెనీకి 4జిఎల్‌టీఈ నెట్‌వర్క్‌ను విజయవంతంగా హ్యాక్ చేశాడు. ఒక్క పైసా కూడా చెల్లించకుండా ఇంటర్నెట్‌ను ఉపయోగించుకుని అబ్బురపరచాడు. ‘కొద్దిసేపు పోర్టల్‌తో ఆడుకున్నాను. లింక్స్‌ను క్లిక్ చేస్తూ ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేశాను. కొన్ని లింక్స్ ఫెయిలయ్యాయి.కొన్ని పనిచేస్తున్నాయి. ర్యాండమ్ యాప్స్ ఇంటర్నెట్‌కు అనుసంధానమవుతున్నాయా లేదా అని తనిఖీచేశాను. స్పీడ్‌టెస్ట్ యాప్ ఎలాంటి డాటా ప్లాన్ లేకుండానే పనిచేస్తున్నవిషయాన్ని గ్రహించాను. ఆ తర్వాత టెస్ట్ సర్వెర్‌లో మార్పులు చే‌యడంలో సఫలమయ్యాను’ అని అజిత్ ఒక పోస్ట్‌లో తెలిపాడు. ఆ తర్వాత వీడియోలు చూడగలిగానని, డాటా లేకుండానే అప్‌లోడ్ చేయడం జరిగిందన్నాడు. తాను ఉద్దేశపూర్వకంగా ఈ పని చేయలేదని, ఇందువల్ల టీ-మొబైల్‌కి కానీ, కస్టమర్లకు కానీ ఎలాంటి హాని జరగలేదంటూ చెప్పాడు. టీ ‘హ్యాకింగ్’ ద్వారా తాను కనుగొన్న విషయాలను (లోపాలను) వెల్లడించిన అజిత్ ఇప్పుడు సదరు నెట్‌వర్క్ స్పందన కోసం ఎదురుచూస్తున్నాడు.

No comments:

Post a Comment