MY NAME

THIS SITE CREATED BY VENKATESHH AMIRISHETTY

new

subpals

Free YouTube Subscribers

Sunday, 25 September 2016

నిజమా… ‘ముఖ్యమంత్రి’గా మహేష్ బాబు?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలకు షాక్ ఇవ్వబోతున్నారా? ప్రస్తుతం సోషల్ మరియు వెబ్ మీడియా సమాచారం మేరకు అయితే ‘అవును’ అన్న సమాధానమే లభిస్తోంది. నిజజీవితంలో రాజకీయాలంటేనే దూరంగా ఉండే మహేష్ బాబు, రీల్ లైఫ్ లో ఏకంగా ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నారని ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోన్న వార్త ట్రేడ్ వర్గాలను షేక్ చేస్తోంది.కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో మహేష్ ‘సిఎం’గానటించబోతున్నారని, ఈ సినిమాను ఓ పొలిటికల్ థ్రిల్లర్ గా కొరటాల మలిచారని హల్చల్ చేస్తున్న ఈ వార్తలో నిజం ఎంతుందనేది కొరటాల, మహేష్ లకే తెలియాలి. రాజకీయ అంశాలతో పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో, కొరటాల మార్క్ బ్యాక్ గ్రౌండ్ సోషల్ మెస్సేజ్తో ఈ సినిమా సిద్ధమవుతోందని టాక్. అయితే దీనిపై స్పష్టమైన సమాచారం వచ్చేవరకు ప్రిన్స్ ఫ్యాన్స్ కు నిద్ర ఉండదని చెప్పడంలో సందేహం లేదు.‘దూకుడు’ సినిమాలో ఎమ్మెల్యేగా నాటకం ఆడిన మహేష్ లుక్ కు అభిమానులు ఏ విధంగాపట్టం కట్టారో తెలిసిందే. మరి అలాంటిది ఏకంగా ఒక ముఖ్యమంత్రి పాత్రలో మహేష్ నిజంగా కనపడితే… సిల్వర్ స్క్రీన్ ఏమైపోవాలి? అందులోనూ సిఎం పాత్రలో ఇప్పటితరం నటులే కాదు, చిరంజీవి తరం హీరోలలో ఒక్కరు కూడా నటించలేదు. దీంతో ఈ సమాచారంపై అసలు వాస్తవాలు ఏంటని ఆరాలుతీయడం మొదలుపెట్టారు. చూడాలి… చివరికిఎలాంటి సమాధానం బయటకు వస్తుందో..?!

No comments:

Post a Comment