MY NAME

THIS SITE CREATED BY VENKATESHH AMIRISHETTY

new

subpals

Free YouTube Subscribers

Thursday 22 September 2016

మీరు ఉదయం లేవాగానే ఇలా చేస్తేమీకు అదృష్టం కలసి వస్తుంది – ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం

చాలా మంది ఉదయానే నిద్ర నుంచి లేచి ఎవ్వరి ముఖం చూడాలో తెలియదు. కొంత మంది మాత్రం తల్లితండ్రుల ఫోటో చూస్తారు … లేదా  వారినే డైరెక్ట్ గా చూస్తారు మరి కొంత మంది పురుషులు అయితే  భార్య ని,  మహిళలు అయితే భర్త ని చూడాలి అని అనుకుంటారు.. …. కానీ మీరు ఉదయం లేవా గానే ఇలా చేస్తే మీ రోజు బాగుంటుంది… ఎవరి ఇష్టాలు వారికీ ఉంటాయి.  మనం సాదారణంగా ఏదైనాపని చేసినప్పుడు లేదంటే ఆ రోజు ఏమి కలిసిరానప్పుడు ”పొద్దున్నే లేచి ఎవరిముఖం చూశానో కాని………..; అని ఎత్తుకుంటారు.  ఉదయం లేవగానే దేవుడి ముఖం కనిపించేలా దేవుడి చిత్రపటం చుడండి. ఉదయం లేచిన వెంటనే మీ అరచేతులు చూసుకోండి. దీనికి కూడా ఒక కారణం ఉంది. అరచేతి ముని వెళ్ళు లక్ష్మి దేవి స్థానం. అరచేయి సరస్వతిస్థానం, అరచేయి కింద మణికట్టు శక్తి స్థానం. దీనికి ప్రమాణం ఏంటి అని సందేహమా?ధన లక్ష్మి చాలా చంచలo అని తెలుసు అందుకే ఆవిడా ఒక చోట నిలవదుఅందుకని ఎప్పుడు దూకేద్దామా అని మునివేళ్ళ మీద కుర్చుని వుంటుంది. మనం ఎవరినైనా డబ్బు గురించి అడిగేటప్పుడు బొటనవేలు చూపుడువేలు టిక్కు టిక్కు మని కొడుతూ అడుగుతాం కదా. అలాగే సరస్వతి దేవి అరచేతిలో ఉంటుంది. మనం పుస్తకం పట్టుకుని చదవాలనుకుంటే అరచేతిలోనే పట్టుకుంటాం. ఏమి చేస్తున్నావు అని ఎవరైనా అడిగితె అరచేతులు రెండు దగ్గర పెట్టు ముడిచి చదువుతున్నాను అని చూపిస్తాం. అలానే మనం ఎవరిననైన కొట్టాలి అనుకున్నా, లేక కోపం వచ్చినపిడికిలి బిగిస్తాం. ఆ పిడికిలి బలం (శక్తి) అంతా మణికట్టు మీదే ఆధారం. కనుక అరచేతిని చూసుకుంటే ముగ్గురు అమ్మల్ని దర్శించినట్టు ఉంటుంది. ఉదయం లేవగానే అరచేతులను చూస్తూ ఈ శ్లోకం పఠించాలి.

కరాగ్రే వసతే లక్ష్మీ

కరమధ్యే సరస్వతీ

కరమూలే తూ గోవిందః

ప్రభాతే కరదర్శనం

భావం

మన చేతివేళ్ళ చివర్లన లక్ష్మీ దేవి, చేతి మధ్యలో సరస్వతీ, ముంజేతి దగ్గర సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తి కోలువై యున్నారు. ఈ శ్లోకం చెప్పి రెండు చేతులతో ముఖాన్ని నిదానంగా తుడుస్తూకళ్ళు తెరిచి చేతులను చూడాలి. అంతా మంచే జరుగుతుంది.

No comments:

Post a Comment