MY NAME

THIS SITE CREATED BY VENKATESHH AMIRISHETTY

new

subpals

Free YouTube Subscribers

Thursday 22 September 2016

మధ్యాహ్నం నిద్ర…ఎంత సేపు మంచిది

నిద్ర నేది అందరికీ తప్పనిసరైన జీవన క్రియ. అది ఎక్కువైనా, తక్కువైనా మానసిక, శారీరక మార్పులు అనివార్యం. జీవనోపాధికి పగలంతా పనిచేయాల్సి రావడంతో రాత్రివేళ నిద్ర పోవడం అన్నది అనాదిగా అలవాటై పోయింది. అనేక కారణాల వల్ల రాత్రి నిద్ర సరిగా లేక పగలు చురుకుగా వుండలేక కష్టపడే వారు ఎందరో.
మనకు ఆహారం ఎంత ముఖ్యమో, నిద్ర కూడా అంతే అవసరం. కానీ, నేటి ఉరుకులు, పరుగుల యుగంలో నిద్రలేమి ఒక జబ్బుగా పరిణమిస్తోంది. సుదీర్ఘ పని గంటలు, కెరీర్ లక్ష్యాలు, ఆర్థిక ఇబ్బందులు, దాంపత్య సమస్యలు ఇవన్నీ మానసిక ఒత్తిడులను పెంచే అంశాలే. గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, పోషకాహార లోపం, అనారోగ్యాలు, మానసిక సమస్యలు ఇవన్నీ నిద్రలేమికి దారితీస్తున్న అంశాలు. రోజులో పని ఒత్తిడి వల్ల కూడా చురుకుతనం తగ్గి అలసిపోయినట్లుగా అనిపిస్తూ వుంటుంది. అలాంటప్పుడు, మధ్యాహ్నం భోజనం ముగించాక చిన్నపాటి కునుకు తీస్తే చాలు. ఆ తర్వాత చలాకీతనం, చురుకుదనం ఇట్టే వచ్చేస్తాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
రాత్రి ఎంతగా నిద్రించినా, మధ్యాహ్నం వేళ చిన్నపాటి కునుకు చాలా ఉపయోగంగా వుంటుంది. పగటినిద్ర మనలో చలాకీతనం, జ్ఞాపకశక్తి స్థాయిలను మెరుగుపరచుతుంది. అయితే, పగటి నిద్రకు చాలా తక్కువ సమయాన్ని మాత్రమే కేటాయించాలి. గంటల తరబడి కునుకు తీయడం సరికాదు. ఈ పగటి నిద్ర మరీ ఎక్కువ సమయం కాకుండా కేవలం 10 నుంచి 20 నిముషాలు మాత్రమే వుండాలట, ఇలా చేస్తే చురుకుతనం, చలాకీతనం పెరిగి ఎంతో ఉపయోగం వుంటుంది.
కానీ మధ్యాహ్నం నిద్ర 20 నిమిషాలు దాటితే మాత్రం కొన్ని నష్టాలు వున్నాయి అని సూచిస్తున్నారు నిపుణులు. 30 నిమిషాల వరకూ మద్యాహ్నం నిద్ర సోమరితనానికి, చిరాకు…మగతకూ దారి తీస్తుందట.
జ్ఞాపక శక్తి మేరుగు పడాలి అంటే ఒక గంట పాటు పడుకోవాలట. పేర్లూ, ఎదుటివారి ముఖాలు ఎక్కువగా గుర్తువుండే అవకాశాలు వుంటాయట. అయితే, నిద్ర జడత్వం పెరిగి పనులు కొద్దిగా కష్టమవుతుందట. గంటన్నర (90 నిమిషాల పాటు) సేపు పడుకుంటే సృజనాత్మకత పెరుగుతుందట. గాఢ నిద్రలోకి జారిపోకుండా చిన్న కునుకు తీయాలంటే కూర్చుని కళ్లుమూసుకోవడం మంచిది.

No comments:

Post a Comment