MY NAME

THIS SITE CREATED BY VENKATESHH AMIRISHETTY

new

subpals

Free YouTube Subscribers

Thursday 22 September 2016

అమ్మాయిలు సీక్రెట్ గా మిమ్మల్ని ఎలా లవ్ చేస్తున్నారో తెలుసుకోండి ఇలా…

ఆడపిల్ల మనసు సముద్రం కంటే లోతు ఎక్కువ అని అంటారు మన పెద్దలు.. సముద్రాన్ని నేనైనా ఈదుకుంటూ వెళ్లవచ్చు కానీ అమ్మాయి మనసులో ఏమిఉందొ తెలుసు కోవడం ఆ బ్రహ్మ దేవుని వాళ్ళ కూడా కాదు అంటారు సరదాగా .. ఒకరిని ప్రేమించడం ఎంత సులువో వారికి ఆ విషయాన్ని తెలియజేయడం అంతేకష్టం. ఒక అమ్మాయిని ఇష్టపడి.. ఆ విషయాన్ని ఆ అమ్మాయికి చెప్పలేక నానా ఇబ్బందులు పడుతుంటారు అబ్బాయిలు. ఆ అమ్మాయి ఎక్క వీళ్ళని కాదంటుందో…. లేక ఆ అమ్మాయికి అలాంటి ఉద్దేశం ఉందో లేదో అన్న భయం ఇలా చేపిస్తుంది. అమ్మాయిని తలుచుకుంటూ..చెట్ల పైన, గోడల మీదా, బుక్స్ లో ఇద్దరి పేర్లు రాసుకుంటూ కాలాన్ని గడిపేస్తారు. కాని కొన్ని సార్లు మీరు ఇష్టపడిన అమ్మాయి కూడా మీ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. కాని ఆ కన్ఫ్యూషన్ లో ఎం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండిపోతారు అబ్బాయిలు. ఇలాంటి కన్ఫ్యూషన్ ని దూరం చేసేందుకే.. కొన్ని అధ్బుతమైన విషయాలు మీ ముందుకు తెచ్చాం. కొంత మంది అమ్మాయిలు  మిమ్ముల్ని మంచి ఫ్రెండ్గా భావించి కూడా ఉంటారు… కాబట్టి మీరు చూసినా  ప్రతి అమ్మాయి మిమ్ములనే ప్రేమిస్తుంది అని అనుకుంటే అంత కన్నా పెద్ద పొరపాటు లేదు .. కొంత మంది  మాత్రమే ఇప్పుడు మేము చెప్పే వాటిలో ఉంటారు , మీకు నచ్చిన అమ్మాయి మిమ్మల్ని సీక్రెట్ గా లవ్ చేస్తుందేమో ఈ కింద వివరాల ద్వారా తెలుసుకోండి…

* ఆమె కళ్ళను, నవ్వును గమనించండి. మిమ్మల్ని ఎక్కువగా గమనిస్తుందని తెలిసినా లేక ఎక్కువ సార్లు మీతో కళ్ళలోకి కళ్ళు పెట్టి మాట్లాడుతున్నా.. ఆమె మీపై ఇంట్రెస్ట్ చూపిస్తుందని అర్ధం. అమ్మాయిలు ఎవరినైనా ఇష్టపడితే ఆ విషయాన్ని వారు ఎక్కువ కాలం దాచలేరు.

* పక్కన ఎంత మంది ఉన్నా మీరు చెప్పే మాటలపై ఎక్కువ దృష్టి పెడుతున్దంటే మీ లైన్ క్లియర్ అయినట్టే. మీరు మాట్లాడే మాటలు.. మీరు చేసే పనులు.. ఇలా మీరు చేసే ప్రతీది ఆమె గమనిస్తుందంటే ఆమె మీపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టే. మీకు ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టం… మీకు ఎలాంటి డ్రెస్ అంటే ఇష్టం.. అనే విషయాలు అడిగి మరీ తెలుసుకుంటుంది.

* ఆ అమ్మాయి బాడీ లాంగ్వేజ్ బట్టి కూడా అమ్మే మీపై ఇంట్రెస్ట్ చూపిస్తుందని తెలుసుకోవచ్చు. మీరు ఎదురైనప్పుడు తనని తాను అందంగా చూపించుకోవాలని ప్రయత్నిస్తుంది. కురులు సరి చేసుకోవడం.. పదే పదే తన మేకప్ ని చెక్ చేసుకోవడం లాంటివి చేస్తుంది. మీ జోకులకు అందరికన్నా ఎక్కువ తానే నవ్వుతుంది.

* అమ్మాయిలకి కంప్లిమేంట్స్ అంటే చాలా ఇష్టం. కానీ మే విషయంలో తానే మీకు తెగ కంప్లిమేంట్స్ ఇస్తుంది. నువ్వు వైట్ షర్ట్ లో చాలా బాగుంటావ్…. అని ఆమె చెప్తే.. మీకు కూడా ఓ తెలియని ఫీల్ వస్తుంది. అవునా? కాదా?? మీ టేస్ట్ ని కూడా ఇష్టపడుతుందని అర్ధం.

* వీలైనప్పుడల్లా మిమ్మల్ని తాకడానికి ప్రయత్నిస్తుంది. కావాలనోలేక అనుకోకుండానో మీ చెయ్యి తనకి తాకినప్పుడు లోలోపల మురిసిపోతుంది. అందుకే గ్రూప్ ఫోటోలు దిగేటప్పుడు, మీ చేతికి ఏదైనా అందించేటప్పుడు, సరదాగా గొడవ పడుతున్నప్పుడు… మిమ్మల్ని తాకడానికి ప్రయత్నిస్తుంది. అలాగని తను మిమ్మల్ని హద్దులు దాటి తాకడానికి ప్రయత్నించట్లేదన్న విషయం మరువకండి.

* మీ గురించి వీలైనంత ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. మీకు ఇష్టమైనవి ఏంటి? ఇష్టం లేనివి ఏంటి? ఇలా అన్ని తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. మీ లైఫ్ లో ముఖ్యమైన వ్యక్తుల గురించి తెలుసుకుంటుంది. ఎందుకంటే ఇంకొన్ని రోజుల్లో ఆ లిస్టులో తను కూడా చేరబోతుందని తన కాన్ఫిడెన్స్.

* మీ కోసం ఎప్పుడైనా సరే.. కలవడానికి రెడీ గా ఉంటుంది. అది పొద్దున్నే ఐదింటికైనా కావచ్చు లేక రాత్రి పదకొండింటికైనా కావచ్చు… నో చెప్పకుండా ఎప్పుడైనా మీతో మాట్లాడడానికి, మీతో కలవడానికి రెడీ గా ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని మించిన పని ఆమెకు వేరొకటి లేదు కనుక.

* తన వీలుకాకపోయినా మిమ్మల్ని హ్యాపీ గా చూడడానికి ఏదైనా చేస్తుంది. తన ఆఫీస్ లో బిజీగా ఉన్నా.. మీ కాల్ వచ్చిందంటే.. ఆ పనిని పక్కకు పెట్టి మీతో మాట్లాడుతుంది. అది కుదరకపోతే… వీలైనంత త్వరగా ఆ పని ముగించుకొని మీకు తిరిగి కాల్ చేస్తుంది. ఒక్కోసారి మీకు ఇష్టమైన కేక్ తెడానికి ఎంత దూరమైనా వెళ్లి తెస్తుంది.

* మీతో ఉన్నప్పుడు.. తన ఫ్రెండ్స్ మే రేలషన్ విషయంలో టీజ్ చేసినా పెద్దగాపట్టించుకోదు. నిజానికి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా టీజ్ చేస్తుంటే మీ ఫీలింగ్ ఎలా ఉందని గమనిస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ తో కూడా పరిచయాలు పెంచుకోడానికి ప్రయత్నిస్తుంది. అలాగని తప్పుగా అర్ధం చేసుకోకండి. తనకు మిగిలిన లాస్ట్ ఆప్షన్ ఇదే మరి. మీ ఫ్రెండ్స్ద్వారా మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టు తెలియజేయడానికి ఇదో ప్రయత్నం.

* ఇక లాస్ట్ కి మిగిలింది ఒకే ఒక్క విషయం…! ఇది చాల డేంజర్..!! అమ్మాయిలలోతప్పకుండా ఉండే క్వాలిటీ ఇది. మిమ్మల్ని వేరే అమ్మాయితో చూస్తే అస్సలు ఓర్వలేరు. మీతో ఉన్న ఇతర అమ్మాయిలతో పైకి నవ్వుతు మాట్లాడినా.. లోపల అగ్నిగుండం ఎప్పుడెప్పుడు పెలుతుందా అన్నట్టు ఉంటుంది. ఒక్కసారి సరదాగా మీకు మీ కాలేజీ లో ఒక అమ్మాయితో రేలషన్ ఉందని చెప్పి చూడండి. కథ మొత్తం మీకేఅర్ధమవుతుంది.ఇప్పుడు మేము చెప్పినవన్నీ ఒకే సారితెలుసుకోవడం కొంచం కష్టమే.. కాని అసాధ్యం కాదు.! ఒక అబ్బాయి తన మనసులో మాట చెప్పడానికి కొన్ని రోజులు పడుతుంది.. కాని ఒక అమ్మాయి తన మనసులో మాట చెప్పాలంటే ఒక యుగం పడుతుంది. ఈ యుగంలో మీకు తన మనసులో మాట చెప్పాలంటే.. ముందు మీ లో ఎంతో ఓపిక ఉండాలి..!

No comments:

Post a Comment